టిడిపి అధినేత కొమ్మారెడ్డి పట్టాభి, వీడియో సందేశం విడుదల చేసారు. తన పై వైసిపీ చేస్తున్న విష ప్రచారం పై ఆయన స్పందిస్తూ, వీడియో సందేశం విడుదల చేసారు. "గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని టిడిపి చేపట్టింది. చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం, ఈ ఉద్యమంలో నేను కూడా పాల్గున్నాను. కొద్ది రోజుల క్రితం కుట్ర పూరితంగా కొన్ని అవరోధాలు సృష్టించారు. ఆ సమయంలో చంద్రబాబు గారితో పాటుగా, లోకేష్ గారు, ఇతర టిడిపి నేతలు, సామాన్య ప్రజలు నాకు సుపోర్ట్ గా నిలిచారు. ఈ ఉద్యమం ఒక తరాన్ని గంజాయి బారి నుంచి కాపాడటం కోసం. గత రెండేళ్లుగా నేను అనేక ఆధారాలతో ప్రెస్ మీట్లు పెట్టాను. వాటికి సమాధానం చెప్పలేక, ఒక మాట అన్నానని, దానికి అర్ధాలు ఆపాదించి, నా ఇంటి పై దా-డి చేసారు. నేను లేని సమయంలో నా ఇంటి పైన దా-డి చేయటమే కాకుండా, 8 ఏళ్ళ నా కూతురుని కూడా భయానక వాతవరణంలో భయ పెట్టారు. ఆ పసి హృదయం భయానికి లోనయ్యింది. చిన్న వయసులో ఆ పాపకు గా-యం అయితే, దాన్ని రూపుమాపటం ఎంత కష్టమో మన అందరికీ తెలుసు. అయినప్పటికీ ఏ మాత్రం మానవత్వం లేకుండా, చిన్న పిల్లను ఒక షాక్ కు గురి చేసారు. బాధ్యత గల తండ్రిగా నా బిడ్డను, నా భార్యను తీసుకుని, ఈ వాతవరణం నుంచి బయటకు తీసుకుని వెళ్తే, దానికి కూడా విపరీత అర్ధాలు తీసారు.

pattabhi 26102021 2

"అనేక రకాలుగా ప్రచారాలు చేసారు వైసిపీ శ్రేణులు. ఈ వీడియో మెసేజ్ ద్వారా నేను ఒకటే తెలియ చేస్తున్నా, ఒక బాధ్యత గల తండ్రిగా ఈ రోజు ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, గా-య-ప-డి-న ఆ పసిహృదయాన్ని కాపాడటం కోసం, ఆ గా-యా-న్ని రూపుమపటం కోసం, ఒక బాధ్యత గల తండ్రిగా పని చేస్తున్నాను. దాని మీద కూడా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ, విపరీత అర్ధాలు తీసారు. ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అతి త్వరలోనే నేను ఒక తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను, దీని తరువాత అతి త్వరలోనే, పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక బాధ్యత గల తండ్రిగా తిరిగి క్రియాశీలకంగా పాల్గుంటాను. గంజాయికు వ్యతిరేకంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గుంటాను. ఈ కుట్ర పూరితమైన కేసులకు భయపడను. ప్రజల కోసం మరిన్ని నిజాలతో ప్రజల మందుకు వస్తాను. న్యాయబద్దంగా అన్ని కుట్ర పూరితమైన కేసులు ఎదుర్కుంటాను. అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను అని, మరోక్క సారి నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు."

Advertisements

Advertisements

Latest Articles

Most Read