వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదంటూనే రాయబారాలు నడిపిస్తున్నారని పవన్ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌ కల్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాయబారం నడిపిన టీఆర్ఎస్ నేతలు ఎవరనే విషయాన్ని చెప్పడానికి పవన్ సాహసించలేదు. దీంతో పొత్తు కోసం రాయబారం నెరపుతున్న ఆ నేతలు ఎవరు, పొత్తు కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఎవరనే చర్చ సాగుతోంది.

kcr 120012019 2

టీడీపీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా పొసగడం లేదు. అదే సమయంలో ఏపీలో కేసీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను జగన్ స్వాగతించారు. అంతేకాదు, ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి సహా పలుచోట్ల వైసీపీ.. తెరాసకు మద్దతు పలికిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెరాస నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ చెప్పడం చూస్తుంటే, వైసీపీ, తెరాస కలిసి ఏపిలో ఎలాంటి రాజకీయం ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది. కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తెరాసకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని అర్థమవుతోందని అంటున్నారు. ఇప్పటికే జగన్, తెరాస మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

kcr 120012019 3

మోడీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని చెబుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చెప్పడం గమనార్హం. పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్.. జనసేతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు రోజుకూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్‌‌తో నిజంగానే టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదింపులు జరిపారా..? లేదా..? అనే విషయాలు తెలియాలంటే వైసీపీ లేదా టీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read