ఎన్టీజీ ఏపీ స‌ర్కారుకి విధించిన వంద‌కోట్లు జ‌రిమానా కూడా మంత్రి పెద్దిరెడ్డి కంపెనీలు పాల్ప‌డిన నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల వ‌ల్లేన‌ని అంద‌రికీ తెలిసిన విష‌యం. అటు పెద్దిరెడ్డిని కాపాడ‌డానికి, ఇటు వంద ల‌క్ష‌లు కూడా ఇవ్వ‌లేని స్థితిలో ఉన్న స‌ర్కారు వంద‌కోట్లు ఎలా క‌ట్ట‌గ‌ల‌ద‌ని ఎన్టీటీ తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లారు జ‌గ‌న్ రెడ్డి.  సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ ప్రభుత్వాని షాక్ త‌గిలింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్ కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ కొట్టివేసి జ‌రిమానా విధించింది. ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం మ‌రోసారి అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎదుట బోల్తా ప‌డింది. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాలో రూ.25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని  ధర్మాసనం ఆదేశించింది. రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‍పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ కు వాయిదా వేసింది. ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదన్న ఏపీ స‌ర్కారు లాయ‌ర్‌ ముకుల్ రోహత్గీ వాద‌న‌పై ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్దమని  కోర్టు ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని ,రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ  కోర‌గా, ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read