తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరా హోరీగా జరుగుతుంది. అధికార వైసీపీ పార్టీ దూకుడు మీద ఉంటుందని అందరూ భావించినా, అనూహ్యంగా తెలుగుదేశం పుంజుకుంది. ఎన్నికల ప్రచారం మొత్తం టిడిపి డామినేట్ చేసింది. ఒక పక్క లోకేష్ దూకుడు, మరో పక్క చంద్రబాబు ఆలోచింప చేసే ప్రచారంతో, టిడిపికి బాగా ఊపు వచ్చింది. అటు పక్క వైసీపీ ప్రచారం కంటే, పోల్ మ్యానేజ్మెంట్ మీదే ఎక్కువ ఆసలు పెట్టుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ , తెలుగుదేశం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తిరుపతి పార్లమెంటరీ తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అవినీతి పాలనని అంతం చెయ్యాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడని, ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు విపరీతంగా పెంచేయడంతో కార్మికులు పనులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఒకసారి ఆలోచించి వైసిపికి బుద్ధి వచ్చేలా ఈ నెల 17వ తేదీన జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు.

peddireddy 11042021 2

టిడిపి దూకుడుతో, వైసీపీ లైన్ మార్చింది. ఈ రోజు పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గెలిస్తే, తమ ఎంపీలు అంతా రాజీనామా చేస్తారు, మేము గెలిస్తే మీ ఎంపీలు రాజీనామా చేస్తారా అంటూ, టిడిపికి ఛాలెంజ్ విసిరారు. అయితే ఈ చాలెంజ్ రాజకీయంగా ఉపయోగపడటం కంటే, ఇది వైసీపీకి బాగా డ్యామేజ్ చేసేది లాగా ఉంది. ఒక పక్క ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి, అందరం రాజీనామా చేద్దాం అని టిడిపి అంటుంటే దానికి వైసీపీ స్పందిచటం లేదు. ప్రత్యెక హోదా కోసం, రాజీనామాలకు రెడీ అని చంద్రబాబు అంటుంటే దానికి వైసీపీ స్పందించటం లేదు. పైగా, రాజీనామాల వల్ల ఏమి ఉపయోగం అంటూ విజయసాయి రెడ్డి, వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో, ప్రజా సమస్యల పై కాకుండా, రాజకీయాల కోసం పెద్దిరెడ్డి ఇలా చాలెంజ్ చేయటం, అది వైసిపీకి ప్లస్ కంటే మైనస్ అవుతుందని చెప్పాలి. ఇక మరో పక్క 5 లక్షల మెజారిటీ అని చెప్తున్న పెద్దిరెడ్డి, ఇప్పుడు టిడిపి గెలిస్తే అనే దాకా వచ్చారు అంటే, పరిస్థితి రోజు రోజుకీ ఎలా మారిపోతుందో అర్ధమవుతుందని, టిడిపి అంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read