అధికార పార్టీకి చెందిన మంత్రులే కాదు, వారి పుత్రరత్నాలు అయినా సరే, వారికి ప్రోటోకాల్ పంట పండినట్టే అని చెప్పాలి. రాష్ట్రంలో మంత్రుల కొడుకులకు, ప్రోటోకాల్ స్వాగతం పలుకుతున్నారు అధికారులు. నిన్న కృష్ణా జిల్లాలో మంత్రి కొడుకుకి ఇలాంటి స్వాగతమే లభించింది. నిన్న మచిలీపట్నంలో జరిగిన ఆర్టిసి కి సంబందించిన డ్రైవింగ్ స్కూల్ తొమ్మిదవ బ్యాచ్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి, ఆర్టిసి రీజనల్ మ్యానేజర్ అతిధిగా రావలసి ఉంది. అయితే ఆయన తనకు ఒక ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్తూ, ఆయన రాలేదు. అయితే వెంటనే అధికారులు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుతో ఈ శిక్షణా తరగతులు ప్రారంభించారు. అలాగే అక్కడ ఉన్న వారికి సర్టిఫికేట్ లు కూడా మంత్రి కొడుకు అందించారు. అయితే అసలు ఈయన ఏ హోదాలో అక్కడకు వచ్చారు ? ఏ హోదాలో అధికారులు ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చారు ? అసలు ఈయన ఎవరు అనే చర్చ కూడా జరిగింది. అక్కడ ఉన్న కొంత మంది వ్యక్తులు, విలేఖరులు కూడా ఇదేమి పద్దతి అంటూ అక్కడున్న ఆర్టిసి అధికారులను ఈ విషయం పై ప్రశ్నించారు. అయితే వాళ్ళు సమాధానం చెప్తూ, అధికారి అందుబాటులో లేకపోవటంతో, ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మంత్రి కొడుకుని తీసుకుని వచ్చినట్టు చెప్పారు.

perni 271020212

యువతకు ప్రోత్సాహం ఇవ్వటానికి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, యువకుడు అయిన మంత్రి కొడుకుని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తీసుకుని వచ్చినట్టు చెప్తున్నారు. అయితే గతంలో కూడా కార్పోరేషన్ కు సంబంధించి కానీ, వివిధ ఇతర కార్యక్రమాల్లో కూడా, ప్రోటోకాల్ నిబంధనలను పూర్తిగా పక్కకు పెట్టి, మంత్రి కొడుకు ఇలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గున్న ఫోటోలు, వీడియోలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఇదే అంశం పై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షం టిడిపి కూడా ఈ అంశం పై విమర్శలు చేసింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా, మళ్ళీ నిన్న మంత్రి కొడుకు, అధికారిక కార్యక్రమంలో పాల్గున్నారు. పదే పదే మంత్రి కొడుకుకి, ఈ విధంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలకటం, ప్రోటోకాల్ పాటించక పోవటం పై, విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయం పై విమర్శలు చేస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని, అధికారులు కొంచెం చూసుకుని ప్రవర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read