రవాణా శాఖా మంత్రి పేర్ని నాని పై గత వారం, ఒక చిన్న పాటి అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మంత్రి తల్లి గత వారం చనిపోయారు. ఆయన తల్లి కర్మ కాండ గత వారం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చి, ఒక తాపీ తీసుకుని, మంత్రి పై అటాక్ చేసారు. అయితే మంత్రి పై హ-త్యా-య-త్నం అంటూ వార్తలు రావటంతో, వెంటనే పోలీసులు, అతను తాగి ఉన్నాడని చెప్పారు. కొన్ని వార్తా చానెల్స్ లో, మంత్రి పై అటాక్ చేసిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడు అని, తాపీ మేస్త్రి అని, ఇసుక లేక పనులు లేక పోవటంతో, సహనం కోల్పోయి ఇలా చేసాడని చెప్పారు. అయితే తెలుగుదేశం నేతలు కూడా ఇవే ఆరోపణలు చేసారు. స్థానిక నేత అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇవే వ్యాఖ్యలు చేసారు. దీంతో కేసు మళ్ళీ ట్విస్ట్ అయ్యింది. అటాక్ చేసిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని, రవీంద్ర అనుచరుడు అంటూ ప్రచారం చేసారు. ఇంకేముంది, ఇది కాస్తా మళ్ళీ రాజకీయ టర్న్ తీసుకుంది. ఇంతటితో అయిపోలేదు. మళ్ళీ పోలీసులు మంత్రి రవీంద్రను టార్గెట్ చేసారు. అసలు మీకు ఆ సమాచారం ఎలా తెలుసు అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాకు పూర్తి సమాచారం చెప్పాలి అంటూ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసు ఇచ్చారు. ఆయన దానికి సమాధానం ఇస్తూ, రిటెన్ గా పంపించారు.

perni 05122020 2

అయితే రెండు రోజులు క్రిందట పోలీసులు రవీంద్ర ఇంటికి వచ్చి, ఆయన స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. అసలు ఇందులో తనను ఎందుకు ఇరికిస్తున్నారని, మీడియాలో వచ్చింది చెప్పినా, ఇప్పటికే రిటెన్ గా ఇచ్చినా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ, రవీంద్ర పోలీసులు పై ఫైర్ అయ్యారు. తరువాత వస్తానని చెప్పటంతో, పోలీసులు వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యవహారం ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు నారా లోకేష్ ఒక ట్వీట్ చేసారు. అటాక్ చేసిన వ్యక్తి మంత్రి తల్లి కర్మ కాండలో పాల్గున్న ఫోటోలు విడుదల చేసారు. దానికి సంబందించిన ఒక వార్త కూడా లోకేష్ ట్వీట్ చేసారు. ఆ ఫోటోలలో కేవలం పది మంది లోపే ఉన్నారు. మరి అతను తెలుగుదేశం వ్యక్తి అయితే, మంత్రి పక్కన ఎందుకు తిరుగుతున్నాడని, పోలీసులు, అనుచరులు ఎందుకు ఊరుకున్నారు అనేది ప్రశ్న. లోకేష్ కూడా ఇదే విషయం చెప్తూ, ఇది ఒక డ్రామాగా ట్వీట్ చేసారు. అనవసరంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేయటం ఆపి, ఇకనైనా ఈ నాటకం బయట పెట్టాలని లోకేష్ ట్వీట్ చేసారు. మరి ఈ విషయం పై, పేర్ని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read