ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత పది రోజులుగా విమర్శలు ఎదుర్కున్న అంశాలు రెండు. ఒకటి సినిమా టికెట్ల వ్యపారం చేయటం. రెండు మటన్ మార్ట్ లు పెట్టి మటన్ అమ్మటం. అయితే మటన్ మార్ట్ లు పెడుతున్నాం అని, జగన్ మోహన్ రెడ్డి గారి సొంత సాక్షి పత్రికే చెప్పింది. మటన్ మార్ట్ లు వచ్చేస్తున్నాయి అంటూ గొప్పగా రాసారు. అయితే నిన్న స్పందించిన మంత్రి అప్పల రాజు, ప్రభుత్వం మటన్ అమ్మటం లేదని, అది ఎల్లో మీడియా సృష్టి అంటూ చెప్పుకొచ్చారు. మరి మంత్రిగారు, తమ ముఖ్యమంత్రి సొంత పేపర్ ని, ఎల్లో మీడియా అనే సాహసం చేసారు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ అంశం ఇలా ఉంటే, సినిమా టికెట్ల వ్యాపారం పై కూడా ప్రభుత్వం ఈ రోజు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వమే ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టి, ఇక నుంచి సినిమా టికెట్లు అమ్ముతుంది అంటూ, ఒక జీవో ఒకటి పది రోజుల క్రితం విడుదల అయ్యింది. ఈ జీవో చూసిన చాలా మంది ఆశ్చర్య పోయారు. అసలు ప్రభుత్వం టికెట్లు అమ్మటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పౌర సమాజం మొత్తం స్పందించినా, సినిమా ఇండస్ట్రీ నుంచి సినీ పెద్దలు కానీ, సినీ హీరోలు కానీ, ప్రొడ్యూసర్ లు కానీ, డిస్టిబ్యూటర్లు కానీ, ఎవరూ కూడా ఈ అంశం పై స్పందించ లేదు. బహుసా ప్రభుత్వం అంటే భయం వల్ల ఏమో అని అందరూ అనుకున్నారు.

perni 14092021 2

సినీమా వాళ్ళకి కేసీఆర్ అన్నా, జగన్ అన్నా భయం కాబట్టి, ఎవరూ స్పందించ లేదు అని అనుకున్నారు. అయితే ఈ రోజు అసలు విషయం చెప్పారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం సినిమా టికెట్ల వ్యాపారం చేస్తుంది అంటూ వస్తున్న వార్తల పై మంత్రి పేర్ని నాని స్పందించారు. తాము సినిమా టికెట్లు అమ్మే విషయం సొంతగా తీసుకున్న నిర్ణయం కాదని, ఒక పక్క సినీ పెద్దలు, సినీ హీరోలు, ప్రొడ్యూసర్లు, డిస్టిబ్యూటర్లు ఇలా అందరూ కూడా, ప్రభుత్వమే టికెట్ లు అమ్మాలని తమను కోరాయని, ప్రత్యేకంగా తనను ఎంతో మంది కలిసి ఈ విషయం చెప్పారని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సినిమా టికెట్లు అమ్మే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సమీక్ష చేస్తున్నామని, దీని పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అంతే కాదు, చిరంజీవి ఫోన్ చేసి జగన్ అపాయింట్మెంట్ అడిగారని, ఆగష్టు చివరి వారంలో ఉండాల్సి వచ్చిన, కుదరలేదని, త్వరలోనే వారు వచ్చి జగన్ ని కలుస్తారని పేర్ని నాని చెప్పారు. మొత్తానికి సినీ పెద్దలు కోరితేనే తాము సినిమా టికెట్లు అమ్మే విషయంలో నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read