ఇన్‌కాంక్స్‌ విభాగంవారిచ్చిన సర్వసాధారణమైన సమాచారాన్ని పట్టుకొని, గంటకొకరి చొప్పున వెర్రిమొర్రిగా రంకెలేస్తున్న వైసీపీనేతలు, ఆపార్టీ ఎమ్మెల్యే అంబి రాంబాబుసహా, అందరూ బుద్ధిలేనివిధంగా మ్లాడుతున్నారని, ఎవరు మీడియాముం దుకొచ్చినా చంద్రబాబు, లోకేశ్‌ల పేరు చెప్పకుండా వెళ్లడంలేదని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయడు ఇప్పటికిప్పుడు ప్రత్యేకంగా తన ఆస్తులగురించి చెప్పాల్సిన అవసరంలేదని, బొత్స, అంబటి, ఇతర వైసీపీమాఫియా నాయకులంతా తెలుసుకోవాలన్నారు. బుర్రతక్కువ తనంతో బుద్ధిలేకుండా మ్లాడుతున్న వారంతా 8ఏళ్లనుంచి చంద్రబాబునాయుడు తనపై, తనకుటుంబసభ్యులపై ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీనేతలు రంకెలువేసినా, వేయకపోయినా, సవాళ్లు విసరకపో యినా చంద్రబాబు తన ఆదర్శాలను విడిచిపెట్టరని కొమ్మారెడ్డి తేల్చిచెప్పారు. 13నెలల క్రితం లోకేశ్‌ తనతండ్రికి, తనకు, ఇతర కుబుంసభ్యులకున్న ఆస్తులవివరాలను వెల్లడించారని, మొత్తం కుటుంబం మొత్తానికి రూ.165కోట్లు ఉన్నాయని, అప్పులు రూ.76కోట్ల ని, నికర ఆస్తులవిలువ రూ.89కోట్ల19లక్షలని చెప్పడం జరిగిందన్నారు.

ఇంతకుమించి తనకుగానీ, తనతండ్రికిగానీ ఒక్కరూపాయి సొమ్ముగానీ, ఒక గజంస్థలంగానీ ఉన్నట్లు నిరూపిస్తే, వాటిని తిరిగిచ్చేస్తానని ఆస్తులు వెల్లడించిన ప్రతిసారీ లోకేశ్‌ సవాల్‌చేస్తూనే ఉన్నారని, ఈవిషయం వైసీపీమాఫియా బృందానికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఇన్నేళ్లలో ఏనాడైనా, జగన్మోహన్‌రెడ్డిగానీ, ఆయనపార్టీనేతలుగానీ వారిఆస్తుల వివరాలను మీడియాఎదుట ఎందుకు వెల్లడించలేకపోయారని పట్టాభి నిలదీశారు. బిత్తరసత్తిబాబుగానీ, అంబటి రాంబాబుగానీ, ఇతర మంత్రులుగానీ ఒక్కరోజుకూడా ఒక్క ప్రకటనచేయలేదన్నారు. దేశవ్యాప్తంగా అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కంపెనీలపై దాడులు జరిగాయని, ఆదాడుల్లో రూ.86లక్షల నగదు, రూ.71లక్షల విలువైన నగలు దొరికితే దాన్ని పట్టుకొని పిచ్చిపిచ్చిగా మ్లాడుతున్నారన్నారు. రూ.2వేలకోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయని ఇన్‌కాంక్స్‌సంస్థ చెప్పిందని, అవేమీ చంద్రబాబునాయుడి ఖాతాలోకో, ఆయన ఇంట్లోకో వెళ్లలేదనే విషయాన్ని వైసీపీమాఫియా తెలుసుకుంటే మంచిదన్నారు. 13నెలలక్రితం ఆస్తులు ప్రకించినప్పుడు చంద్రబాబునాయుడి కుటుంబానికి ఉన్న ఆస్తులకంటే, నేటికి ఒక్కరూపాయి ఆదాయం, ఒక గజంభూమి అధికంగా ఉన్నట్లు ఏ మంత్రైనా రుజువుచేయగలడా అని పట్టాభి నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్‌పై 31 కేసులుంటే, 17కేసులు ఆర్థికనేరాలకు సంబంధించినవే ఉన్నాయని, అది ఆయన ట్రాక్ రికార్డు అని, అలాంటి వ్యక్తి మనీలాండరింగ్‌ కేసులగురించి చెప్పడం సిగ్గుచేటన్నారు. తానెంత అవినీతిపరుడో జగన్మోహన్‌రెడ్డే తన ఎన్నికల అఫిడవిట్ లో, సంతకం పెట్టి మరీ చాలా స్పష్టంగా చెప్పాడన్నారు. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌, చంద్రబాబుని దోషిగా చూపాలని చూడటం ఎంతి సిగ్గుమాలినతనమో ప్రజలే ఆలోచించాలన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి జాతకం చూస్తే, ఆయనపై 13కేసులున్నాయని, 11కేసులు సెక్షన్‌ 420కి చెందినవే నని, పొద్దునలేస్తే కోర్టులచుట్టూ తిరుగుతూ, ఎదుటి వారిని గురించి మ్లాడుతున్నాడన్నారు. ఏ1, ఏ2లను చూస్తే, ప్రధాని, అమిత్‌షాలు భయపడుతున్నారని, ఎక్కడ తమకాళ్లు పట్టుకొని లాగేస్తారోనన్నభయంతో వారు జగన్‌, విజయసాయిలను దగ్గరకు రానివ్వడంలేదని పట్టాభిఎద్దేవాచేశారు. జగన్‌, ఆయనమాఫియా పిలిస్తే, మీడియా ముందుకు రావాల్సిన దుర్గతి చంద్రబాబునాయుడికి పట్టలేదని, ఆయన ఇప్పికే పలుమార్లు తన ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగిందన్నారు. ఏ1, ఏ2 లాంటి వాళ్లను చూసే సుప్రీంకోర్టు నేరమయచరిత్ర ఉన్న రాజకీయనేతల వివరాలను బహిర్గతంచేయాలనే ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఏడీఆర్‌ రిపోర్ట్‌ ప్రకారం జగన్‌ టికెట్ ఇచ్చిన వారిలో 97మందికి నేరచరిత్ర ఉందన్నారు.

దేశంలోనే మహిళలపై ఘోరాలకు నేరాలకు పాల్పడినవారిలో అత్యధికులున్న పార్టీగా వైసీపీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. జగన్‌ ట్రాక్ రికార్డు కారణంగా దేశానికి కూడా అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి నోటీసులు అందాయన్నారు. చంద్రబాబునాయుడు ఏనాడూ తనజీవితంలో అవినీతిపరులకు కొమ్ముకాయలేదని, ఆర్థిక నేరగాళ్లను వెంటేసుకొని తిరగలేదన్నారు. 2004లో రూ.9లక్షల18వేలుగా ఉన్న జగన్‌ ఆదాయం, 2011 కి రూ.365కోట్ల కు ఎలా చేరిందన్నారు. ఏవ్యాపారం చేస్తే రూ.9లక్షలఆదాయం, ఆరేళ్లలో రూ.365 కోట్లకు చేరిందో జగన్‌ చెబితే, ప్రజలుకూడా అదేవ్యాపారం చేసి బాగుపడతారని పట్టాభి దెప్పిపొడిచారు. 2019నాికి రూ.600కోట్లకు జగన్‌ ఆదాయం పెరిగిందన్నా రు. అల్లాఉద్దీన్‌ అద్భుతదీపమేదైనా జగన్‌ చేతిలో ఉందా అని పట్టాభి ప్రశ్నించారు. దొంగసంతకాలు, మనీలాండరింగ్‌కు పాల్పడి, షెల్‌కంపెనీలు పెట్టి, డాక్యుమెంట్లు ఫోర్జరీచేసి, సూట్ కేసు కంపెనీలు నడిపి, అంతర్జాతీయస్థాయిలో ఆర్థికనేరాలకు పాల్పడి, చివరకు 31కేసులు ఉన్న వ్యక్తిగా జగన్మోహన్‌రెడ్డి ఎదిగాడన్నారు. జగన్‌కు , వైసీపీనేతలకు దమ్ము, ధైర్యముంటే, చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబసభ్యులు ప్రకించిన దానికంటే, వారికి ఎక్కువ ఆస్తులున్నట్లు నిరూపించాలి. అలా చేయలేకపో తే, వైసీపీనేతలు, జగన్‌ వారికి బహిరంగంగా క్షమాపణలుచెప్పాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read