జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ట్విట్టర్ ద్వారా, రాజకీయ ప్రత్యర్ధుల పై విమర్శలు గుప్పిస్తూ, సమస్యల పై స్పందిస్తూ, తన మనసులో ఉన్న భావాలని సూటిగా చెప్తూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ నుంచి, ఇది వరకు చేసిన కొన్ని ట్వీట్స్ డిలీట్ అయ్యాయి అంటూ, వార్తలు గుప్పు మంటున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య చేసిన కొన్ని పొలిటికల్ ట్వీట్లను డెలీట్ చేయడం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. మార్చి 19 నుంచి ఆగస్టు 21 వరకు పవన్ చేసిన పొలిటికల్ ట్వీట్లన్నీ డెలీట్ అయిపోయాయని, వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, ఆ సమయంలో బీజేపీ పై కూడా ఎక్కువ విమర్శలు చేసారని, అందుకే ఆ ట్వీట్స్ ఇప్పుడు డెలీట్ అయ్యాయని, ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త పరిణామం అని అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తరువాతే ఈ ట్వీట్స్ డిలీట్ అయ్యాయి అని ప్రచారం సాగుతుంది.

pk 022122019 2

పవన్ ఢిల్లీ పర్యటన ఇందుకోసమే, పార్టీ చెప్పలేదు. ప్రైవేటు కార్యక్రమానికి వెళ్ళారని చెప్పింది. అయితే మీడియాకు మాత్రం, జగన్ మోహన్ రెడ్డి పాలన పై, అమిత్ షా, మోడీకి ఫిర్యాదు చెయ్యటానికి వెళ్ళారని, లీక్ ఇచ్చారు. కాని, అధికారికంగా, పవన్ కళ్యాణ్, ఆ రెండు రోజులు ఎక్కడ ఉన్నారు, ఎవరిని కలిసారు, ఏమి చర్చరించారు అనే విషయం మాత్రం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు పవన్ చేసిన కొన్ని ట్వీట్స్ డిలీట్ అవ్వటం పై, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే, రాష్ట్రంలో జరుగుతున్న రివర్స్ నిర్ణయాలకు అడ్డుకట్ట పడాలి అంటే, భవిషత్తు తరాలకు ఈ రాష్ట్రన్ని మిగాల్చాలి అంటే, బీజేపీ అవసరం ఎంతైనా ఉందని, వారితో కలిసి నడవాల్సిందే అని పవన్ నిర్ణయానికి వచ్చి ఉంటారని చెప్తున్నారు.

pk 022122019 3

ఎప్పటి నుంచో విలీనం డిమాండ్ వినిపిస్తున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు, దాన్ని ఖండిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకు పార్టీని నడుపుతానని చెప్తున్నారు. ఈ క్రమంలోనే, బీజేపీతో కలిసి, పవన్ కళ్యాణ్, ప్రజా పోరాటాలు చేసే అవకాసం ఉందని, రాబోయే రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ విధంగా మారుతుంది అంటూ, వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా బలం పుంజుకోవాలి, నాలుగు సీట్లు రావాలి అంటే, పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆకర్షణ ఉపయోగ పడుతుంది అని నమ్ముతుంది. ఇప్పటికిప్పుడు టిడిపితో కలిసి వెళ్ళే అవకాసం లేదు, అందుకే జనసేనని వాడుకుని, బలపడాలని, బీజేపీ ప్లాన్ గా తెలుస్తుంది. మొత్తానికి, ఇప్పుడు పవన్ ఆ ట్వీట్స్ ఎందుకు డిలీట్ చేసారు, అనేది చర్చగ మారింది. చూద్దాం భవిష్యత్తులో ఏమి జరుగుతుంది, రాజకీయం ఎటు తిరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read