ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 2019 ఎన్నికలు అయిన తరువాత, ఒక కొత్త రాజకీయ పొత్తు పొడిచింది. 2014లో బీజేపీ, తెలుగుదేశంతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన, 2018 నుంచి కమ్యూనిస్ట్ లతో కలిసింది. ఎన్నికలు అవ్వగానే, మళ్ళీ బీజేపీ వద్దకు పవన్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, ఢిల్లీ వెళ్లి చర్చించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి పని చేసేలా ప్రణాళికలు రచించారు. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో, పొత్తు బాగానే నడిచింది. అమరావతిలో కలిసి ఉద్యమం చేసే దాకా వెళ్ళారు, అయితే తరువాత సోము వీర్రాజు బీజేపీ ఏపి అధ్యక్ష్యుడు అవ్వటం, విష్ణు వర్ధన్ రెడ్డికి కూడా కీలక పదవి రావటంతో, ఏపి బీజేపీ, వైసీపీ బ్రాంచ్ అన్నట్టు తయారు అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం, అన్నీ ఓర్చుకుంటూ, తన పని తాను చేసుకుంటూ, అవసరం అయిన ప్రతి సారి బీజేపీకి గౌరవం ఇస్తూనే వస్తున్నారు. అయితే బీజేపీ వైపు నుంచి మాత్రం, జనసేన పార్టీ పై అంత గౌరవం లేదా అనే సంకేతాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో, బీజేపీ తమను అసలు లెక్క చేయక పోవటంతో, జనసేన సొంతగా జాబితా ప్రకటించింది. అయితే బీజేపీ కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి, పవన్ ను బుజ్జగించటం, అలాగే తిరుపతి సీటు పై హామీ ఇవ్వటంతో, పవన్ విరమించుకున్నారు. అయినా తెలంగాణా బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ను అవమానించారు. అయినా పవన్ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నిక పై, వేడి మొదలైంది. మరో రెండు నెలల్లో ఎన్నిక వచ్చే అవకాసం ఉంది.

pk23012021 2

దీంతో పవన్ కళ్యాణ్, తిరుపతి సీటు పొత్తులో భాగంగా తమకే వస్తుందని భావిస్తున్నారు. నిన్న తిరుపతిలో పర్యటించిన పవన్, తిరుపతి ఎన్నిక పై మాట్లాడుతూ, ఏపి బీజేపీ నేతల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నిక, తమ పార్టీనే పోటీ చేయాలని, తమ పార్టీకే ఇక్కడ బలం ఉందని, జనసేన కార్యకర్తలు అంటున్నారని పవన్ అన్నారు. కేంద్రంలో బీజేపీ నాయకులు, తమకు ఇస్తున్న గౌరవం, రాష్ట్రంలో బీజేపీ నేతలు తమకు ఇవ్వటం లేదు అనే అభిప్రాయం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పై తమకు అసంతృప్తి ఉన్నా, ఒక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి, ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోవటం లేదని, దీని పై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతల్లో మార్పు కనిపిస్తుందని అన్నారు. అలాగే తిరుపతి ఉప ఎన్నిక, తమకు టిక్కెట్ ఇస్తే, తాను స్వయంగా ప్రచారానికి తిరుగుతా అని, బీజేపీ ఏ మేరకు సపోర్ట్ ఇస్తుందో వారు చెప్తారని అన్నారు. అలాగే ఒక వేళ బీజేపీ సీటు తీసుకుంటే, జీహెచ్ఏంసి ఎంత సీరియస్ గా చేసారో, అంత సీరియస్ గా బీజేపీ తీసుకుని, కేంద్ర నాయకులను రప్పించి, అంత గట్టిగా చేస్తాను అంటే, తాము కూడా మద్దతు ఇస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సీటు ఎవరు పోటీ చేయాలి అనే దాని పై, మరో వారం రోజుల్లో నిర్ణయం చెప్తాం అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read