తెలుగు భాషను కాపాడుకునే ప్రయత్నంలో, ఎవరు పోరాటం చేసినా, కలుపుకు పోవాల్సిందే. అయితే, మన తెలుగు తల్లిని, మన సంస్కృతిని తిట్టిన వారిని మాత్రం, దూరం పెట్టి ఈ పోరాటం చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో, తెలుగు మీడియంను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు పై, అందరూ భగ్గు మంటున్నారు. ఈ ఉత్తర్వులు వచ్చి నాలుగు రోజులు అయ్యింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, ఈ విషయం పై పోరాడుతుంది. గతంలో చంద్రబాబు, తెలుగు మీడియంతో పాటు, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారని, ఎవరికి కావలసిన ఆప్షన్ వారు సెలెక్ట్ చేసుకునే అవకాసం ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం, ఒకేసారి అసలు తెలుగు మీడియం అనేది లేదు అని చెప్పటం పై, తెలుగుదేశం తప్పుబడుతుంది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎలా నేర్చుకుంటారని, టీచర్స్ కి ఆ అనుభవం ఉండాలి కదా అని ప్రశ్నిస్తుంది. అదీ కాకా, మన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని, ఇలా పూర్తిగా ఎత్తేయటం సరైన విధానం కాదని, టిడిపి వాదిస్తుంది.

pk 10112019 2

అయితే ఈ సమస్య పై ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా, పవన్ కళ్యాణ్, ఈ విషయం పై, వైసిపీ ప్రభుత్వం పై, విమర్శలు గుప్పించారు. తెలుగు మీడియం ఆపెస్తుంటే, ఇంకా అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. తెలుగు భాష గొప్పదనం అర్థమైతే పాఠశాలల్లో నిషేధం విధించరని చెప్తూ, కొన్ని పద్యాలు, పుస్తకాలు గురించి ట్వీట్ చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, పవన్ కళ్యాణ్ చేసిన ఓక ట్వీట్ మాత్రం, అభ్యంతరకరంగా ఉంది. తెలుగు భాషను ఎలా పరిరక్షించుకోవాలో, మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి అంటూ, పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మాత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యంతరం చెప్తున్నారు.

pk 10112019 3

పవన్ కళ్యాణ్ , కేసీఆర్ ను పొగిడే సందర్భం ఇది కాదని, ఆయన పొగడాలి అనుకుంటే, వేరే సందర్భంలో కేసిఆర్ ని పొగడలాని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను, కవులను, సంస్కృతిని , చివరకు మన తెలుగు తల్లిని, కేసిఆర్ మాట్లాడిన విషయాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఆంధ్రా వాళ్ళ సంస్కృతి ఒక సంస్కృతా, వాళ్ళది రికార్డింగ్ డాన్స్ ల సంస్కృతీ అని కేసిఆర్ మాట్లాడిన మాటలు, ఏ ఆంధ్రుడు మర్చిపోడు. అలాగే అయన మన ఆది కవి నన్నయ్య పై చేసిన వ్యాఖ్యలు, తెలుగు తల్లిని దెయ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు కాని, ఏ ఆంధ్రుడు హర్షించరు. తెలుగు మహా సభలు అని పెట్టి, సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవని వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటి ? ఈ విషయంలో జగన్, కేసిఆర్ రెండూ రెండే. ఎవరూ తక్కువ కాదు. పవన్ కళ్యాణ్, ఈ విషయంలో మాత్రం, కేసిఆర్ ను ప్రస్తావించటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read