రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై, ఆయన పాలన పై విరుచుకుపడుతున్నారు. నిన్న జగన్ మోహన్ రెడ్డి కులం గురించి ప్రస్తావిస్తూ, ఆయన మతం మారిన తరువాత కూడా, ఇంకా ఎందుకు రెడ్డి అని కులం తగిలించుకుని తిరుగుతున్నారని, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్, మరింత డోస్ పెంచారు. ఈ రోజు తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్, అక్కడ న్యాయవాదులతో, ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇలాంటి రాజకీయ నాయకులకు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి వాళ్ళని, ఉక్కుపాదంతో అణిచివేస్తారని, పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో న్యాయవాదులతో సమావేశమైన పవన్ కల్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేస్తూ, జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

shaha 03122019 2

అవినీతి చేసి, జైల్లో ఉండి, మొండిగా తిరిగి, జగన్ మోహన్ రెడ్డి సియం అవ్వగాలేనిది, ప్రజా సమస్యల పై పోరాడే తాను, మొండిగా తిరిగి, సియం ఎందుకు అవ్వలేను అని పవన్ అన్నారు. తాను మనస్సాక్షి ప్రకారం సమస్యల పట్ల స్పందిస్తాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇన్ని సమస్యలతో, ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నేను కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి రాజకీయాలు చాలా దారుణంగా తయారు అయ్యాయని, ఇలాంటి వారికి మోదీ, షా లాంటి వాళ్లే కరెక్ట్ అని పవన్ వ్యాఖ్యానించారు. రాయలసీమను, కేవలం కొన్ని గ్రూపులు కబ్జా చేసి, తమ చేతుల్లో పెట్టుకున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ఇలాంటి వారికి అమిత్ షా కరెక్ట్ అని చెప్తున్నాని పవన్ అన్నారు.

shaha 03122019 3

నా మతం మానవత్వం, కులం మాట తప్పని కులం అని జగన్ రెడ్డి అంటున్నారని, అంటే జగన్ గారి దృష్టిలో, మిగతా కులాలు మాట తప్పుతాయనేది జగన్ ఉద్దేశమా ? అని పవన్‌ ప్రశ్నించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల బూతు పురాణం పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యేలకు భాష తెలియదా? వారికి బూతులు తిట్టడమే పనా? చట్టాల్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలే పిచ్చి కూతలు కూస్తుంటే, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? అని జగన్‌ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఒక పక్క రాయలసీమలో ప్రత్యర్ధుల పంటలు నరికేస్తున్నారని, ఒక పక్క నిత్యవసరధరలు భారిగా పెరిగిపోయాయని, ఇంకా ఈ 151 మండి ఎమ్మెల్యేలు ఉండి ఏమి లాభం అంటూ పవన్ స్పందించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read