ప్రస్తుతం రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ పేరు మారు మొగి పోతుంది. ఈ రోజు ప్రకటించిన అయుదు రాష్ట్రాల ఎన్నికల్లో, రెండు రాష్ట్రాలలో ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత పార్టీకి, తమిళనాడులో స్టాలిన్ పార్టీకి ఆయన రాజకీయ సలహదారుగా ఉన్నారు. రెండు చోట్లా ఆయన భారీ విజయం అందించారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మూడు అంకెల స్కోర్ దాటదు అని చెప్పి ముందే చాలెంజ్ చేసారు. దాటితో, నేను సలహదారు పదవి నుంచి వెళ్ళిపోతా అని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీ రెండు అంకెల స్కోర్ దాటక పోయినా, ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారు పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఇక ఏ రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేస్తాన్నా అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇప్యాక్ ని ఇక నుంచి తన సహ ఉద్యోగులు నడుపుతారని చెప్పారు. తాను మాత్రం రాజకీయ వ్యూహకర్తగా ఉండను అని, వేరే ఇంకా ఏదో తాను జీవితంలో చేయాలనీ అనుకుంటున్నా అని అన్నారు. ఏమి చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే ఈ రోజు దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ పేరు కలవరిస్తున్న సమయంలో, ఆయన తాను తప్పుకుంటున్నా అని చెప్పటం, అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

pk 02052021 2

అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. బీహార్ నుంచి గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అదే విధంగా మమత కూడా, రాజ్యసభ టికెట్ ఇస్తారు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక వైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, సమాజాన్ని విడదీసి, చిచ్చు పెట్టి, ఓట్లు వేసుకుంటారు అనే అభియోగాలు ఉన్నా, రాజకీయం అనే వార్ లో, ఏది తప్పు కాదు అని సమర్ధించే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిన పరిణామాలు ప్రశాంత్ కిషోర్ పట్ల తీవ్ర వ్యతిరేకత తీసుకుని వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కుల పరంగా చిచ్చు పెట్టి, ఒక కులం పై ద్వేషం పెంచేలా చేసి, సక్సెస్ అయ్యారు. అయితే తరువాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, అభివృద్ధి అనే మాట మర్చిపోయి, అప్పులు చేసి సంక్షేమం చేస్తూ, రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుని వేల్లిపోయారని, ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్రఅధికం అని చెప్పే వారు ఉన్నారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read