జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పై, కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతూనే ఉంది. నిన్నటినిన్న, కేంద్రం మంత్రి హైదరాబాద్ వచ్చి, జగన మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ, బహిరంగంగా చెప్పినా, జగన్ వైపు నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇక పోలవరం విషయంలో కూడా జగన్ వైఖరితో కేంద్రం విసుగు చెందింది. అమరావతి విషయంలో, కేంద్రం రాసిన లేఖలకు, జగన్ ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో, అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా ఇలాంటి నిర్లక్ష్య వైఖరే జగన్ ప్రభుత్వం అనుసరిస్తుంది. పోలవరం విషయంలో ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం లేఖ రాసి వివరణ అడగగా, ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటం పై కేంద్రం జలశక్తి మంత్రిత్వశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వనికి మరో వర్తమానం పంపింది.

polavaram 10092019 2

పీఎంఓ కి కూడా వివరణ ఇవ్వరా, రెండు రోజుల్లో సమాధానం చెప్పండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి, పీటర్ అనే తన బంధువు చేత ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం పోలవరం పై రివెర్స్ టెండరింగ్ కి వెళ్తున్నారు. ఇదే రిపోర్ట్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి కూడా ఇచ్చారు. అయితే ఈ రిపోర్ట్ కు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన రిపోర్ట్ కు చాలా తేడా ఉండటంతో, రెండు రిపోర్ట్ ల మధ్య తేడాకు కారణాలను తెలపాలంటూ పీఎంవో గత నెల 29వ తేదీన లేఖ రాసింది. దీని పై సెప్టెంబర్ 3 లోగా వివరణ ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఏమైందో ఏమో కాని, జగన్ ప్రభుత్వం మాత్రం, ప్రధాన మంత్రి ఆఫీస్ కు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు.

polavaram 10092019 3

దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. మరో రెండు రోజుల్లో ప్రాధాన మంత్రి కార్యాలయానికి వివరణ ఇవ్వాలని గట్టిగా కోరారు. గడువు దాటిపోయి వారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, వెంటనే ప్రధానికి వివరణ ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ని అడగగా, కేంద్ర జలశక్తిశాఖ పంపిన రిమైండర్‌ ఇంకా అందలేదని, అందగానే సమాధానం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. తాము పీఎంవో రాసిన లేఖకు సమాధానం ఇచ్చే పనిలో ఉన్నామని, మధ్యలో సెలవులు రావడంవల్ల కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి జగన్ వైఖరి పై, కేంద్రం రోజు రోజుకీ అసహనం వ్యక్తం చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read