ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్, గత చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టింది. ఏమి లేని చోట, దాదాపుగా 72 శాతం పనులు చేసి, చంద్రబాబు ఆశ్చర్య పరిచారు. మరో ఆరు నెలలు చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే, గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాసం ఉండేది. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, రివర్స్ టెండరింగ్ అంటూ, మొదలు పెట్టటంతో, ప్రాజెక్ట్ దాదాపుగా ఏడాది పాటు ఆగిపోయింది. తరువాత అయినా వేగం పెంచారా అంటే, ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అనిపిస్తున్నారు. మరో పక్క కేంద్రం నుంచి వరుస షాకులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం విషయంలో, గత చంద్రబాబు హయాంలో ఒప్పుకున్న వాటిని కూడా ఇప్పడు ఒప్పుకోవటం లేదు. ఇది ఇలా ఉంటే ఈ రోజు రాజ్యసభ సాక్షిగా పోలవరం ప్రాజెక్ట్ కు మరో షాక్ ఇచ్చింది కేంద్రం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేంద్రం షాకింగ్ సమాధానం ఇచ్చింది. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి మంత్రి సమాధానం ఇస్తూ, పోలవరం వ్యయం విషయంలో, 2014లో ఏ రేటు అయితే ఉందో, అదే రేటు ప్రకారం, కేంద్రం నిధులు ఇస్తుందని తేల్చి చెప్పారు. 2014 తరువాత పెరిగిన అంచనాలను కేంద్రం చెల్లించలేదు అంటూ, మంత్రి షాకింగ్ సమాధనం ఇచ్చారు.

vsreddy 26072021 2

ఆ పెరిగిన ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తేల్చి చెప్పారు. డిజైన్ మార్పు వల్ల, పోలవరం హెడ్ వర్క్స్ అంచనాలు పెరిగాయని, ఆ ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించలేదని తేల్చి చెప్పారు. హెడ్ వర్క్స్ పనుల్లో డిజైన్ మార్పుల వల్ల రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగింది. అయితే ఈ అంచనా కూడా తమకు సంబంధం లేదని చెప్పారు. ప్రాజెక్ట్ డిజైన్ల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని మంత్రి తేల్చి చెప్పారు. అయితే ఆ డిజైన్ లు నిబంధనలు ప్రకారం ఉన్నాయో లేవో, సిడబ్ల్యుసి చూస్తుందని అన్నారు. ఇవన్నీ చెప్తూనే, పెరిగిన అంచనాలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. అయితే సుమారుగా 55 వేల కోట్ల వరకు పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు అవుతుందనే అంచనాల మధ్య, కేలవం 20 వేల కోట్లకే పరిమితం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అంత భారం వెచ్చించి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలుగుతుందా అనే సందేహం వ్యక్తం అవుతుంది. అయితే గత నాలుగు రోజులుగా హడావిడి చేస్తున్న మన ఎంపీలు,ఈ అంశం పై, వెల్ లోకి దూసుకువెళ్లి పోరాటం చేస్తారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read