కర్మ సిద్దాంతం గురించి మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం చేసుకున్న కర్మ ఫలాలు, మనకు తిరిగి వస్తాయని. అది మంచి అయినా, చెడు అయినా. ఇప్పుడు పోలవరం విషయంలో, జగన్ ప్రభుత్వానికి అదే జరగబోతుందా, అంటే, అవును అనే సమాచారం వస్తుంది. గతంలో ప్రతిపక్ష నాయుకుడిగా ఉండగా, ఇష్టం వచ్చినట్టు పోలవరం పై ఆరోపణలు చేసి, చంద్రబాబు పై అబాండాలు వేసి, రాజకీయం చేసారు. అప్పుడు చేసిన ఆ పనులే, ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి చుట్టుకునే అవకాసం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పిలిచుకునే పోలవరం ప్రాజెక్ట్, కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇందు కోసం,బీజేపీ వ్యుహాత్మికంగా పావులు కదుపుతుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయ్యింది, ఇంత వరకు ఒక్క తట్ట మట్టి కూడా పోలవరం ప్రాజెక్ట్ లో ఎత్తింది లేదు. రివర్స్ టెండరింగ్ అంటూ, కోర్ట్ లకు ఎక్కారు.

polavaram 11102019 2

రాష్ట్ర బీజేపీ నేతలు , ఇదే అవకాసంగా తీసుకున్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్ట్ ఏరియాకు వెళ్లి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ బృందం పర్యటించనుంది. అక్కడి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్‌ను కలసి మెమోరాండం సమర్పించనుంది. ఈ నాలుగు నెలల్లో జగన్ ఏమి చెయ్యలేదని, అందుకే ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని కోరనున్నారు. ఇందు కోసం, గతంలో జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి రాసిన లేఖలు, విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాలు కూడా ఇవ్వనున్నారు. గతంలో చంద్రబాబుని సాధించటం కోసం, పోలవరం ప్రాజెక్ట్ కేంద్రమే చేపట్టాలని, జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాలు రాసారు. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో చెప్పారు.

polavaram 11102019 3

ఇప్పుడే ఇవే ఆయుధాలుగా, బీజేపీ రంగంలోకి దిగుతుంది. ఎలాగు చంద్రబాబు 73 శాతం పూర్తీ చేసారు కాబట్టి, మిగత పని తేలికగా అయిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ క్రెడిట్ ఇచ్చి, జగన్ ఆయన నాయన ఫోటో, పేరు పెట్టుకోవటానికి తప్ప, రాజకీయంగా మనకు ఎందుకు ఉపయోగపడదు అని, అందుకే మనమే ఈ ప్రాజెక్ట్ తీసుకుని, రాజకీయంగా బలపడదాం అని బీజేపీ ఆలోచిస్తుంది. అయితే ఇప్పటి వరకు, కేంద్రం చేప్పట్టిన ఏ జాతీయ ప్రాజెక్ట్, పోలవరం లాగా పురోగతి సాధించలేదు. చంద్రబాబు పట్టుబట్టి, ప్రతి వారం రివ్యూలు చేసి, 73 శాతం పూర్తీ చేసారు. మరి, ఇప్పుడు కేంద్రం తీసుకుంటే, అంత వేగంగా చెయ్యగలదా అనేది చూడాలి. ఎవరు చేసినా, ఎవరి ఫోటో పెట్టుకున్నా, ఎవరి పేరు పెట్టినా, ముందు పోలవరం ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read