జగన్ అమెరికా నుంచి రాగానే హోటాహుటిన చేసిన మొదటి సమీక్ష పోలవరంలో కోర్ట్ మరియు కేంద్రం మొట్టికాయల పైన. ఒక పక్క వరదలు వచ్చి, ప్రజలు అల్లాడి పొతే, అది పక్కన పెట్టి మరీ, ముందుగా పోలవరం పై సమీక్ష చేసారు. అది కూడా ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యటానికి కాదు. ప్రాజెక్ట్ ను ఆపి, కొత్త టెండర్ పిలవటంలో విఫలం అయినందుకు. దీని పై అధికారులతో సమావేశం అయ్యారు, హైకోర్ట్ ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, అలాగే కేంద్రం ఎందుకు మన మీద ఆగ్రహంగా ఉంది అంటూ సమీక్ష జరిపారు. అయితే అధికారులు మాత్రం ఏమి చెప్తారు ? ఇది పూర్తిగా పొలిటికల్ డెసిషన్ కదా. ఒక సీనియర్ అధికారి చొరవ తీసుకుని, ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ విఫలం అయ్యిందో పూర్తి వివరంగా జగన్ మోహన్ రెడ్డికి చెప్పారు. పోలవరం రీ టెండరింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ తప్పటడుగు వేసిందో చెప్పారు.

jagan 25082019 2

ఇప్పటికే జరుగుతున్న ఒక కాంట్రాక్టు, అదీ పనులు దూసుకు వెళ్తున్న వేళ, మనం పొలిటికల్ గా డెసిషన్ తీసుకుని రద్దు చేసాం. అవినీతి జరిగింది అని చెప్పాం కాని, ఎక్కడా పాలనా తప్పు జరిగింది అని చెప్పలేదు. నవయుగ కంపెనీ 73 శాతం పనులు పూర్తీ చేసేలా సహాయ పడింది. అలాంటి సంస్థని తప్పించే సమయంలో, పలనా తప్పు వాళ్ళు చేసారు అని మనం కోర్ట్ కి కాని, ఇటు కేంద్రానికి కాని చెప్పలేక పోయాం. అందుకే ఇటు కోర్ట్ కాని, అటు కేంద్రం కాని, మన వాదనతో ఏకీభవించలేదు. అంతే కాదు రివర్స్ టెండరింగ్ కు వెళ్తే, ఇంత తక్కువ ధరకు పనులు జరుగుతాయా ? అనుకున్న సమయానికి కొత్త కాంట్రాక్టర్ వచ్చి పనులు, ఇంతే వేగంగా పూర్తీ చేయ్యగలుగుతారా అనే విషయం కూడా మనం సరిగ్గా చెప్పలేక పోయాం అంటూ అధికారులు జగన్ కు విన్నవించారు.

jagan 25082019 3

ఇవన్నీ విన్న జగన్ కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పోలవరం పనుల పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎదో ఒక నెపం దొరికితే తప్ప అటు కోర్ట్ కాని, ఇటు కేంద్రం కాని, జగన్ ప్రభుత్వ వాదన వినే పరిస్థితులో లేదు. అందుకే ఎదో ఒక విధంగా, విజిలెన్స్ విచారణలో, ఎక్కడో ఒక చోట నవయుగ తప్పు చేసినట్టు తెలిస్తే, ఆ పాయింట్ మీద, పోలవరం టెండర్ లు రద్దు చేస్తున్నాం, అని ఇటు కోర్ట్ కు, అటు కేంద్రానికి చెప్పి, ఒప్పించవచ్చు అనేది జగన్ ఆలోచన. అందుకే జగన్ అమెరికా నుంచి వచ్చీ రావటంతోనే, ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పోలవరం విషయంలో, బాగా పని చేస్తున్న నవయుగని తప్పించాలని జగన్, ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. చూద్దాం, అవినీతిని విజిలెన్స్ అయినా బయట పెడుతుందో లేదో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read