ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్ లో ఒక వ్యక్తి తాను పలానా ప్రశ్నలు అడగగా, ఆర్టిఐ నుంచి తనకు వచ్చిన సమాధానాలు గురించి, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఆర్టీఐ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రెండేళ్ళలో పోలవరంలో చేసిన పనికి, చేస్తున్న ప్రచారానికి ఎక్కడా పొంతన లేదనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుంచి అక్టోబర్ 2020 వరకు పోలవరం పై చేసిన ఖర్చు కేవలం రూ.779 కోట్లు మాత్రమే. గత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.11 వేల 749 కోట్లు. దీనికి కేంద్రం రీయింబర్స్ చేస్తూ వస్తుంది. ఇక జరిగిన పనులు విషయం చూస్తే, డ్యాం పనులు ఇప్పటి వరకు జరిగింది 72.29%. గతంలో జగన్ సమక్షంలో జరిగిన రివ్యూలోనే చంద్రబాబు హాయంలో 70 శాతం పనులు అయినట్టు చెప్పారు. అంటే ఈ 20 నెలల్లో పోలవరం పనులు జరిగింది కేవలం 2.29 % మాత్రమే అని ఈ ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం చెప్తున్న దానికి, జరుగుతున్న పనులకు ఎక్కడా సంబంధం లేదు. ప్రచారం మాత్రం, చంద్రబాబు ఏమి చేయలేదు, మొత్తం మేమే చేసేసాం అని చెప్తున్నారు. కానీ వాస్తవం చూస్తే ఇలా ఉంది.

polavaram 13012021 2

పోలవరం ప్రాజెక్ట్ లో 55 వేల కోట్లు ఖర్చు పెడితే కానీ పూర్తీ అయ్యే పరిస్థితి లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే, ఇలా అరకొర నిధులతో పనులు చేస్తూ, ప్రచారం చేస్తుందని, తెలుగుదేశం పార్టీ వాపోతుంది. ఒక పక్క ఆర్ అండ్ ఆర్ అలాగే ఉందని, ఆర్ అండ్ ఆర్ లో ఎలాంటి పనులు జరగటం లేదని, పునరావాసం కూడా పట్టించుకోవటం లేదని, ఇవన్నీ అడిగితే మాత్రం, నోరేసుకుని పడిపోతారని వాపోతున్నారు. బుగ్గన ప్రతి నెల ఢిల్లీ వెళ్లి, ఏ నెలకు ఆ నెల అప్పు తెచ్చుకోవటం, ఆ నెల గడిపేయటం పైనే దృష్టి పెట్టారని, కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని వాపోతున్నారు. ఇక మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల కోట్లు అప్పు తెచ్చిందని, కానీ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కి మాత్రం, కేవలం రూ.779 కోట్లు ఖర్చు పెట్టారని, తెచ్చిన డబ్బులు ఏమై పోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ ఆర్టీఐ రిపోర్ట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికైనా తీసుకొస్తున్న అప్పు, సంపద సృష్టించే ఇలాంటి ప్రాజెక్ట్ ల పై ఖర్చు చేస్తారని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read