ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న పనులు రోజుకి ఒక రికార్డుని దాటుతున్నాయి. రామతీర్ధం ఘటనలో చంద్రబాబు, అచ్చేన్నాయుడు, కళా వెంకట్రావ్, విజయసాయి రెడ్డిని అంతం చేసే కుట్ర చేసారు అంటూ, పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలపటం సంచలనం సృష్టిస్తుంది. చంద్రబాబుని ఏ1గా, అచ్చేన్నాయుడుని ఏ2గా, కళా వెంకట్రావ్ ని ఏ3 గా పెట్టి, మొత్తం 12 మంది ముద్దాయులుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏడుగురుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో, విజయసాయిరెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారని, దానికి ప్రధాన కారణం చంద్రబాబు అని రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు. విజయసాయి రెడ్డి, ముగ్గురు పేర్లు చెప్పి, తనను చంపేందుకు కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. విజయసాయి రెడ్డిని అంతం చేసేందుకే ఆయన కార్ పై చెప్పులు, వాటర్ ప్యాకెట్లు, రాళ్ళు వేసారని, ఒక రాయి కారుకి తగలి అద్దం డ్యామేజ్ అయ్యిందని, మరో రాయి విజయసాయి రెడ్డి, పర్సనల్ సెక్యూరిటీ కు తగిలిందని, ఆయనకు గాయం అయ్యిందని తెలిపారు. ఇక మరో పక్క ఇప్పటికే నాలుగు రోజుల క్రితం, కళా వెంకట్రావ్ ని, రాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసి, కొద్ది సేపటి తరువాత విడుదల చేసిన సంగతి తెలిసిందే.

cbn 24012021 2

అయితే తన పై కేసు పెట్టటం పై, కళా వెంకట్రావ్ హైకోర్టుకు వెళ్లారు. తన పై అక్రమ కేసు పెట్టారని, విజయసాయి రెడ్డి ఘటనలో, తాను అక్కడ లేకపోయినా, తన పై అక్రమంగా కేసు పెట్టారని అన్నారు. దీని పై స్పందించిన హైకోర్ట్, తదుపరి విచారణ వచ్చేంత వరకు, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు అంటూ పోలీసులను ఆదేశించి, విచారణ వాయిదా వేసింది. ఇక ఘటన గురించి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. లేని వివాదాన్ని విజయసాయి రెడ్డి ఎలా చేసారో అర్ధం అవుతుంది. నిజానికి చంద్రబాబు రామతీర్ధం వెళ్ళాలని అనుకున్నారు. ఆయన వెళ్లి వచ్చేస్తే ఏమి ఉండేది కాదు. కానీ విజయసాయి రెడ్డి, చంద్రబాబు వచ్చే గంట ముందు రామతీర్ధం వెళ్లారు. అంటే అక్కడ జనాన్ని రెచ్చగొట్టటానికి అని అర్ధం అవుతుంది. అసలు పోలీసులు ఎలా విజయసాయి రెడ్డికి పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మధ్యలో దూరింది, హడావిడి చేసింది, విజయసాయి రెడ్డి. పర్మిషన్ ఇచ్చింది పోలీసులు. మధ్యలో ఎవరో చెప్పులు వేసి కొడితే, దానికి చంద్రబాబు కారణం అని చెప్పటం, అరెస్ట్ లు దాకా వెళ్ళటం, ఇవన్నీ ఏదో సినిమాలో చూసినట్టు ఉంది. మరి ఏ1గా చంద్రబాబుని పెట్టి ఏమి సాధించాలని, జగన్ అనుకుంటున్నారో..

Advertisements

Advertisements

Latest Articles

Most Read