అందరి ఫోకస్ శాసనమండలిలో, తెలుగుదేశం వ్యూహం ఈ రోజు ఎలా ఉంటుంది అని భావిస్తున్న వేళ, ఈ రోజు టిడిపి ఎమ్మెల్సీలను ముందుకు కదల నివ్వకుండా, చేసిన ఘటనతో, టిడిపి ఎమ్మెల్సీలు అవాక్కయ్యారు. ఈ రోజు శాసనమండలి సమావేశానికి టిడిపి ఎమ్మెల్సీలు బయలుదేరారు. అయితే, వారిని సచివాలయం సమీపంలో ఉన్న, ఫైర్ స్టేషన్ దగ్గర, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు ఆపారు అని తెలుగుదేశం ఎమ్మెల్సీలు అడగగా, వీరి వాహనాల పై, ఎమ్మెల్సీ స్టిక్కర్‌లు లేవని, అందుకే ఆపామని పోలీసులు చెప్పారు. అయితే దీని పై తెలుగుదేశం ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కారులోనే ఎమ్మెల్సీలు ఉంటే, ఇంకా స్టికర్ లు ఎందుకని, మండి పడ్డారు. కార్లో ఎమ్మేల్సీ ఉండాలా ! కారుకి ఎమ్మేల్సీ స్టిక్కర్ ఉండాలా ! ఏది ముఖ్యం అంటూ, పోలీసులని నిలదీశారు. తీవ్ర వాగ్వివాదం అనంతరం, ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు.

mlc 220102020 2

తమను మానసికంగా ఇబ్బంది పెట్టటానికి, ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని, మండి పడ్డారు. అయితే ఈ రోజు శాసనమండలిలో, తెలుగుదేశం వ్యూహం ఎలా ఉంటుంది అనే దాని పై, ఉత్కంట నెలకొంది. అలాగే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది కూడా చూడాలి. అయితే, ఈ రోజు కూడా లైవ్ ప్రసారాలు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియాల్సి ఉంది. నిన్న శాసన మండలిలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏకంగా మహిళా సభ్యుల పైకి, మంత్రులు దూసుకువెళ్ళటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఆ సమయంలో, మంత్రులకు అడ్డు వెళ్ళకపోతే, ఏమి జరిగేదో అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి ప్రసంగించారు. రాజధాని రైతులు చనిపోతే కనీసం పరామర్శించని సీఎం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

mlc 220102020 3

అసెంబ్లీ సమావేశాల కోసం డమ్మీ సీఎం కాన్యాయిని తిప్పారన్న ఎమ్మెల్సీ సంధ్యారాణి. సంధ్యారాణి కామెంట్లపై అధికార పక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మంత్రులు కామెంట్ చేసారు. అయితే ఈ సందర్భంలో సంధ్యారాణికి అండగా నిలిచిన టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు. మాట మాట పెరగటంతో, ప్రతిపక్ష సభ్యుల వైపు దూసుకొచ్చిన మంత్రులు కొడాలి నాని, అనిల్. ఒక్కసారిగా సభలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత వాతవరణం. ఈ సమయంలో ఉమ్మారెడ్డి సభ్యులను శాంతింప చేసారు . ఇదే సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వ విధనాలను తప్పు పట్టిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. మూడు రాజధానుల విధానం సరి కాదన్న మాధవ్. ల్యాండ్ పూలింగ్ విధానం మంచిదని.. తప్పులను సరిదిద్దాలని మాధవ్ సూచన.

Advertisements

Advertisements

Latest Articles

Most Read