తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు నిన్నటి నుంచి మూడు రోజుల పాటు, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. శనివారం హైదరాబాద్ వెళ్ళిన చంద్రబాబు, సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి, గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం నుంచి, ఏలూరు దగ్గరలో ఉన్న దుగ్గిరాల గ్రామానికి, మాజీ ఎమ్మేల్యే చింతమనేని ప్రభాకర్ ను పలకరించటానికి వెళ్లారు. అయితే ఈ పర్యటన మొత్తం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. చంద్రబాబు వెంట కాన్వాయ్‌తో వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ ఆపుతూ వచ్చారు. అయితే కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నం చెయ్యటంతో, చంద్రబాబు కాన్వాయ్ ఆపి, కిందకు దిగి, పోలీసుల తీరు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు స్వయంగా కిందకు దిగటంతో, కార్యకర్తలకు కూడా గుమికూడి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

tour 19112019 2

ఈ సందర్భంగా చంద్రబాబు పోలీసుల తీరు పై అసహనం వ్యక్తం చేస్తూ, తమాషాలు చేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల వాహనాలను ఎందుకు ఆపుతున్నారు అంటూ పోలీసులను నిలదీశారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు పర్యటన కోసం, గన్నవరం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరారు. మార్గ మధ్యలో హనుమాన్‌ జంక్షన్‌లో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆగి, స్వామికి పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామానికి, మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి వెళ్లి పరామర్శించటానికి బయలుదేరారు. ఈ క్రమంలో కలపర్రు టోలుగేటు వద్దకు వచ్చేసరికి, చంద్రబాబుకు ముందు కాన్వాయ్‌లో ఉన్న వాహనాలను పోలీసులు ఆపేశారు.

tour 19112019 3

గన్నవరం దగ్గర నుంచి ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబుకి చెప్పటంతో, చంద్రబాబు తన వాహనం నుంచి దిగి, పెదవేగి ఎస్సై మోహనరావు, అక్కడ ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారుల పై అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రజా సమస్యల పై పోరాటం చేసే ప్రతిపక్షం అని, ఎక్కడికి వెళ్తున్నా, ఇలాగే ఇబ్బందులు పెడుతున్నారని, ఇక్కడ ఎందుకు వారి వాహనాలు ఆపాలి అంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో పోలీసులు కొంచెం మెత్తబడి, వివాదం పెద్దది కాకుండా, టిడిపి నేతలు, కార్యకర్తల వాహనాలను విడిచిపెట్టడంతో కాన్వాయ్‌ ముందుకు సాగింది. అయితే, మళ్లీ జాతీయ రహదారి వద్ద నుంచి దుగ్గిరాల ఊరిలోకి వెళ్లేందుకు వాహనాలను డైవర్ట్ చేస్తూ ఉండగా, అక్కడ కూడా పోలీసులు మరోసారి తెలుగుదేశం నేతల వాహనాలను పోలీసులు ఆపేసారు. అక్కడ కూడా చంద్రబాబు కలుగజేసుకోవడంతో విడిచిపెట్టారు. ఇలా చంద్రబాబు కాన్వాయ్‌కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read