కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్తు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా, ఉండటానికి, స్పాట్ బిల్లింగ్‌ను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల బిల్లింగ్ కోసం, గత మూడు నెలల సగటు విద్యుత్తు రీడింగ్ వినియోగాన్ని తీసుకుని, మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణలోకి తీసుకోవాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని apspdcl వెబ్​సైట్‌లో ఉంచుతారు. ఈ బిల్లుని, ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. మిగతా రీడింగ్ ను, ఆ తర్వాతి నెలలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నెలా, మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్తు వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికి వచ్చి బిల్లు తీస్తూ ఉంటారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, స్పాట్ బిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే, రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. మూడు నెలల బడ్జెట్​కు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కరోనా భయాందోళనలు, కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.

మరో పక్క, ఉద్యోగ సంఘాలు ఒక రోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించాయి. కొవిడ్‌–19 నివారణా చర్యలకు ఈ మెుత్తాన్ని అందించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి నేతలు లేఖలు సమర్పించారు. ఈ విరాళం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read