పోలవరం పై జగన్ ప్రభుత్వం ఎందుకో కాని, నవయుగని తప్పించి, మరో కొత్త కాంట్రాక్టర్ ని తీసుకురావాలని, ఎంతో పట్టుదలగా ఉంది. నిన్న ఇదే విషయం పై రివర్స్ టెండరింగ్ కి వెళ్తున్నాం అంటూ, రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలు రిలీజ్ చేసి, ఈ రోజు పోలవరం పై కొత్త టెండర్ పిలిచే ఆలోచన చేస్తున్నారు. అయితే నిన్న కాక మొన్న, మూడు రోజుల క్రితం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ విషయం పై, మీ వైఖరి సరిగ్గా లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కొత్త టెండర్ పిలిస్తే, ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ అయిపోతుంది అని, అలాగే ఖర్చు భారీగా పెరిగిపోతుందని చెప్పింది. అంతే కాదు, నవయుగ ఎంతో బాగా పని చేస్తున్నా, ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు అని ఏపి ప్రభుత్వాన్ని నిలదీసింది. మేము కేంద్రానికి నివేదిక ఇస్తున్నాం, అప్పటి వరకు ఆగండి అని చెప్పింది.

ppa 17082019 2

అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, ఈ రోజు కొత్త టెండర్ పిలవటానికి రెడీ అయిపోతుంది. అయితే విషయం తెలుసుకున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఏపి ప్రభుత్వానికి ఈ సారి లేఖ రాసింది. మూడు రోజుల వ్యవధిలోనే మళ్ళీ లేఖ రాసే పరిస్థితి వచ్చింది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌.కె.జైన్‌ , జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి లేఖ రాస్తూ, మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆపండి, ప్రిక్లోజర్‌, రీ టెండరింగ్‌ ఆలోచనల్ని విరమించుకొండి. ఇంత తొందర ఎందుకు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పై, స్పష్టత ఇచ్చేదాకా ఆగండి అంటూ ఆయన ఘాటు లేఖ రాసారు. ఈ నెల 13న జరిగిన మన సమావేశంలో, చర్చించిన విషయాలు గుర్తు తెచ్చుకుని, అందుకు అనుగుణంగా ఉండండి అంటూ సూచించారు.

ppa 17082019 3

అయితే ఈ లేఖ రావాటంతో, ఇప్పుడు ఏపి ప్రభుత్వం డిఫెన్సు లో పడింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కాదనటం అంటే, ఇప్పుడు ఏకంగా మోడీని కాదు అనటమే, ఏమి చెయ్యలి అనే విషయం పై తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే సాయంత్రం లోపు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో ఏపి అధికారులు ఉన్నారు. జరిగిన విషయాన్నీ మొత్తం, అమెరికాలో ఉన్న జగన్ కు వివరించారు. ఆయన చెప్పే సమాధానం కోసం, ఇక్కడ అధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఒక పక్క కేంద్ర మంత్రి ఈ విషయం పై వద్దు అనటం, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా అన్ని కారణాలతో వివరంగా చెప్పటంతో, ఏమి చెయ్యాలని పరిస్థితిలో ఇప్పుడు ప్రభ్తుత్వం ఉంది. మోడీని కాదని, జగన్ ముందుకు వెళ్ళే అవకాసం ఉందా ? చూద్దాం...

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read