ఆయన పేరు పీఆర్ మోహన్. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న అందరికీ సుపరిచితుడు. ఎన్టీఆర్ ఉన్న టైం దగ్గర నుంచి, పార్టీ ఆఫీస్ కే సేవలు అందిస్తూ వస్తున్నారు. చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర కాని, ఎలాంటి ప్రజా పోరాతమైనా, ఆయన అన్నీ ముందుండి చూసుకునే వారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా శాప్ చైర్మెన్ గా కూడా చేసారు. ఇప్పుడు అధికారం పోవటంతో, మళ్ళీ పార్టీ ఆఫీస్ లోనే సేవలు అందిస్తున్నారు. ఈ రోజు పీఆర్ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా, అధినేత చంద్రబాబు వద్దకు వచ్చి, 5 వేల రూపాయిలు, కార్యకర్తల నిధికి విరాళం ఇచ్చారు. ఈ డబ్బులు కష్టాల్లో ఉన్న కార్యకర్తకు ఎవరికైనా ఇవ్వమని కోరారు. అయితే ఆయాన చూపిన చొరవ పై చంద్రబాబు ముగ్ధులు అయ్యారు. అయన అధికారం ఉన్నా లేకపోయినా, ఎన్టీఆర్ టైం దగ్గర నుంచ, పార్టీ నుంచి ఏమి ఆశించకుండా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

gift 18102019 2

ఈయనేమో ఇక్కడే ఉంటారనే, ఆయన భార్య లాయర్ అని, ఆవిడను అడిగి మరీ, 5 వేలు రూపాయిలు, కార్యకర్తలు కోసం ఇచ్చారని, అభినందిస్తున్నాని చంద్రబాబు అన్నారు. అయితే ఈ సందర్భంలో, చంద్రబాబు, పీఆర్ మోహన్ కు ఏమి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక, తన జేబులోని పెన్ను తీసి, పీఆర్ మోహన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వార్ల రామయ్య, నక్కా ఆనందబాబు తదితర నేతలు, పీఆర్ మోహన్ ను అభినందిస్తూ, చంద్రబాబు గారి పెన్ తీసుకునే అదృష్టం మీకు వచ్చింది అంటూ, అభినందించారు. ఇక అంతకు ముందు చంద్రబాబు విలేఖరుల సమావేశంలో ప్రభుత్వం పై మండి పడ్డారు. జగన్ అవలంభిస్తున్న విధానాల పై, విమర్శలు గుప్పించారు.

gift 18102019 3

"రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టడం, జర్నలిస్ట్ లను బెదిరించడం దారుణం. మీడియాపై ఆంక్షలు విధిస్తూ జీవో 938ను మరింత పదును పెడుతూ కేబినెట్ లో నోట్ తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం. 5నెలల్లో అన్నిరంగాల్లో వైసిపి నేతలు విఫలం అయ్యారు. ప్రజల్లో విశ్వాసం పోయింది. ఇసుక కృత్రిమ కొరత తెచ్చారు. ఊళ్లో కళ్లెదురుగా ఉన్న ఇసుక తెచ్చుకునే వీల్లేకుండా చేశారు. నియంత్రణ పేరుతో ఇసుక దొరికే పరిస్థితే లేకుండా చేశారు. 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రిజర్వాయర్లు నిండుగా ఉన్నప్పటికీ, కరెంట్ కోతలు తెచ్చారు. మద్యంపై జె ట్యాక్స్ విధించి రేట్లు విపరీతంగా పెంచేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షాపత్రం టైపిస్ట్ లకే ఫస్ట్ ర్యాంకులు వస్తే, కోచింగ్ సెంటర్లకు ముందే లీకేజి అయితే, దానిని ప్రశ్నిస్తే నేరమా..? దానిపై రాస్తే జర్నలిస్ట్ లపై కేసులు పెడతారా..? అన్నా కేంటిన్లు రద్దు చేస్తారా..? సంక్షేమ పథకాలు నిలిపేస్తారా..? అదేమని అడిగితే కేసులు పెడతారా..? నరేగా, నీరు చెట్టు బిల్లులు నిలిపేస్తారు, 5నెలల్లో తట్ట మట్టి వేసిన పాపాన పోలేదు. టిడిపి కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు అంతేలేదు. ఇప్పుడు జర్నలిస్ట్ లపైనే దాడులు చేస్తున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read