ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. బ్యారేజీ పైకి వాహనాలను నిషేదించారు. బ్యారేజీ బలహీనంగా ఉంది, జాగ్రత్తా అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. వాహనాలు అనుమతి ఇస్తే, ఆ ప్రకంపనలకు బ్యారేజీకి ఇబ్బంది కలగవచ్చని అధికారులు భావించి, రాకపోకలు నిషేదించారు. మరో పక్క, బ్యారేజీ పైన ఉన్న రెయిలింగ్‌ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. 24, 39వ ఖానాల వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఫుట్‌పాత్‌కు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ దెబ్బతింది. అది ఏక్షణంలోనైనా పడిపోవచ్చునని పోలీసు అధికారులు చెబుతున్నారు. అక్కడ ప్రత్యేకంగా పోలీసులను పెట్టి, అక్కడ ఎవరూ నుంచో కుండా చేస్తున్నారు. రైలింగ్ కూలిపోతే తాత్కాలిక ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం రెడీ అయ్యింది. 2009 తరువాత ఇంత భారీ వరద ఇప్పుడే వచ్చింది.

barrage 17082019 2

నిన్న ఒకేసారి 7 లక్షలు క్యూసెక్కుల వరద నీరు, 70 గేట్లు ఎత్తి వదిలారు. వరద ఉధృతికి బ్యారేజ్ షేక్ అవుతూ కనిపించింది. మరో పక్క, బ్యారేజ్ రెండు గేట్లకు పగుళ్లు రావటంతో అధికార యంత్రాంగం హై అలర్ట్ అయ్యింది. పగుళ్లను పరిశీలించిన అధికారులు, ప్రస్తుతానికి ముప్పు లేదని అధికారులు తేల్చారు. బలహీనంగా ఉన్న గేట్లకు తాత్కాలికంగా మరమత్తులు చేపట్టేందుకు ప్రయత్నం చేసినా, వరద ఉదృతికి వారి వల్ల కాలేదు. అందుకే ఇక ఏ మాత్రం ఉపేక్షించకుండా, బ్యారేజి పై ట్రాఫిక్ ఆపేశారు. అయితే సందర్శకుల తాకిడి మాత్రం బాగా ఉంది. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకుని, ఎక్కువ మంది పోలీసులను పెట్టారు. ప్రజలు ఎవరు బ్యారేజీ పై ఎలాంటి ఇబ్బందులు కలిగంచకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

barrage 17082019 3

అయితే ఈ పరిస్థితి రావటం పై, మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణా వరదలు దాదపుగా రెండు వారల నుంచి మొదలయ్యాయి. ఆదివారం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తారు. అయితే, నాలుగు అయిదు రోజులు వరకు, నీటిని కిందకు ఫుల్ గా ఎందుకు వదలలేదు అనే వాదన వస్తుంది. పై నుంచి ఫ్లడ్ ఎక్కువగా ఉన్నా, బ్యారేజీ వద్ద ఎక్కువగా అపారనే వాదన వినిపిస్తుంది. అయితే పరిస్థితి ఒక్కసారిగా తారు మారు అవ్వటంతో, నిన్న ఒకేసారి 7 లక్షల క్యుసెక్ లకు పైగా వదిలారు. ఈ రోజు 8 లక్షలకు వెళ్తుందని భావిస్తున్నారు. ఇలా ఒకేసారి వదలటంతో, బ్యారేజీకి ఇబ్బందికర పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరో పక్క రెండు పెద్ద పెద్ద ఇసుక పడవలు వచ్చి గేట్లకు అడ్డు పడటం కూడా వివాదం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read