మా ఎన్నికలు అయిపోయి, రెండు వారాలు అవుతున్నా, ఇంకా ఆ వేడి కొనసాగుతూనే ఉంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వైసిపి పార్టీ ప్రమేయం పై సంచలన ఆధారాలను ప్రకాష్ రాజ్ బయట పెట్టారు. నిన్న ప్రకాష్ రాజ్ చేసిన ఫిర్యాదుతో మరో వివాదం చెలరేగింది. మా ఎన్నికల సమయంలో, పోలింగ్ బూత్ లో, జగ్గయపేటకు చెందిన వైసీపీ నేత, క్రిమినల్ రికార్డు ఉన్న నూకల సాంబశివరావు అనే వ్యక్తి పోలింగ్ సమయంలో లోపల ఉన్నట్టు, ప్రకాష్ రాజ్ వీడియో ఆధారాలు బయట పెట్టారు. ఇలాంటి వైసిపి రౌడీ షీటర్లను అక్కడ పెట్టటం వల్లే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయాని, దీన్ని చూస్తూ మీరు ఏ విధంగా నిర్లక్ష్యం చేసారు, ఏ విధంగా చూస్తూ వదిలేసారు అని చెప్పి, ప్రకాష్ రాజు, ఎన్నికల కమీషనర్ ని ప్రశ్నిస్తూ, ఒక లేఖ రాసారు. దానికి సంబందించిన ఫోటోలును ప్రకాష్ రాజ్ మీడియాకు విడుదల చేసారు. అయితే దీని పై ప్రకాష్ రాజ్ కోర్టుకు కూడా వెళ్తారని తెలుస్తుంది. అయితే దీని పై స్పందించిన ఎన్నికల అధికారి, మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చని, కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చు అంటూ, ఆయన లేఖను విడుదల చేసారు. అయితే దీని పై ప్రకాష్ రాజ్ త్వరలోనే కోర్టుకు వెళ్తున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, వైసిపి నేతల ఫోటోల పై చర్చ జరుగుతుంది.

prakash 231020212

అసలు వైసిపి రౌడీ షీటర్ అక్కడకు ఎందుకు ఉన్నాడు ? జగ్గయ్య పేటకు చెందిన ఈ వ్యక్తి రౌడీ షీటర్. జగన్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ప్రకాష్ రాజ్ విడుదల చేసారు. అసలు ఈ రౌడీ షీటర్ కు అక్కడ ఏమి పని ? ఎవరు తీసుకుని వచ్చారు ? ఎవరు వెళ్ళమంటే వెళ్లారు అనే చర్చ జరుగుతుంది. మోహన్ బాబు ఇప్పటికే జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మెగా క్యాంప్ కు చెక్ పెట్టటానికి, సిని ఇండస్ట్రీ పై ఆధిపత్యం కోసం, జగన్ మోహన్ రెడ్డి మోహన్ బాబుకు సహకారం అందించారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఏకంగా వైసిపి నేతలు పాల్గునట్టు, ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ప్రకాష్ రాజ్ ఈ ఫోటోలు విడుదల చేసారు. అంతే కాకుండా, ఎన్నికల జరిగిన రోజు, కౌంటింగ్ జరిగిన రోజు, మొత్తం సిసి ఫూటేజ్ మొత్తం ఇవ్వాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసారు. ఇప్పటికే పోలీసులకు కూడా కంప్లైంట్ చేసారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసిపి హ్యాండ్ ఉందని తేలటంతో, ఈ ఎన్నికలు ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read