జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అంటే కారణం, ప్రశాంత్ కిషోర్. వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్, మోడీని ప్రధానిని చేయటంలో కీలక పాత్ర పోషించారు. తరువాత వివిధ రాష్ట్రాల్లో పని చేసి, జగన్ మోహన్ రెడ్డి కోసం కూడా పని చేసారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సింపుల్ గా చెప్పాలి అంటే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టటం, గతంలో మోడీని పైకి తేవటానికి మతాల మధ్య చిచ్చు పెట్టాడు. తరువాత జగన్ వద్దకు వచ్చేసరికి, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇలా చిచ్చు పెట్టటమే ప్రశాంత్ కిషోర్ వ్యూహం. ప్రశాంత్ కిషోర్ జగన్ మోహన్ రెడ్డికి చేసిన తరువాత, పశ్చిమ బంగాల్ లో మమతతో చేసారు, తరువాత తమిళనాడులో స్టాలిన్ తో చేసారు, ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ తో పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి జాతీయ రాజకీయాల పై మనసు పడింది. మోడీని ఎలాగైనా దింపాలి అనే వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ వేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. చాలా సార్లు సోనియా, రాహుల్ తో కూడా భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెడితేనే పార్టీలో చేరతానని చెప్పటం, చివరకు కాంగ్రెస్ పార్టీ అందుకు ఒప్పుకోక పోవటంతో, తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం లేదు అని, ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పారు.

prasanth 04052022 2

తరువాత రెండు రోజులకే, ప్రశాంత్ కిషోర్, తాను సొంత పార్టీ పెడుతున్నాను అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టటం వెనుక, పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకునే ముందు, రెండు రోజుల పాటు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అక్కడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా జగన్, కేసిఆర్, ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఆర్ధిక వనరులు ఇస్తారనే సమాచారం బయటకు పొక్కింది. ఈ విషయం ఢిల్లీ వరకు వెళ్ళింది. జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేరు, అలాగనే బీజీపీని నమ్మటానికి లేదు. ఎందుకంటే, బీజేపీ ఏదో ఒక నిమిషంలో మింగేస్తుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ పైకి ఎదిగితే, అది తమకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. మమత, స్టాలిన్, నితీష్, కేసీఆర్, జగన్, కేజ్రీవాల్, వీరందరూ స్టాలిన్ క్లైంట్స్ కాబట్టి, అందరూ ఒక ఫ్రంట్ గా ఏర్పాటు అయ్యి, వచ్చే ఎన్నికల్లో మోడీని డీ కొట్టే అంశంలో భాగంగానే, ప్రశాంత్ కిషోర్ ని ఆర్ధిక వనరులు ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read