తన పరిధులు దాటి వ్యవహరించారు అంటూ, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ కు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ ఇస్తూ, వారం రోజుల్లో సమాధానం చెప్పాలి అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చిన మరుసటి రోజే, ఎల్వీ సుబ్రమణ్యం, జగన్ ఆగ్రహానికి గురయ్యి, బదిలీ అయ్యి, బాపట్లకు వెళ్లారు. అయితే, అప్పటి చీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై, ఇప్పటి ఇన్‌చార్జ్‌ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌కు వివరణ ఇచ్చారు, ప్రావీణ్ ప్రకాష్. రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసి వివరణ ఇచ్చారు. తాను చేసిన ప్రతి పని నిబంధనలు ప్రకారమే చేసానని, ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదని రాసుకొచ్చారు. నిబంధనల ప్రకారమే, మొన్న జరిగిన క్యాబినెట్ సమేసంలో, వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, గ్రామ న్యాయాలయాల పై మంత్రివర్గ భేటీ అజెండాలో పెట్టినట్లు ఆయన వివరించారు. మరి దీని పై ఇంచార్జ్ సిఎస్ ఎలా స్పందిస్తారో చూడాలి.

praveen 07112019 2

అయితే, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ కు, షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఎల్వీ సుబ్రమణ్యంను వెంటనే బదిలీ చెయ్యటం పై విమర్శలు వచ్చాయి. కనీసం ఆ షోకాజ్ నోటీస్ కు సమాధానం వచ్చేంత వరకు అయినా, ఆగి ఉంటే బాగుండేదని, ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చినందుకే, బదిలీ చేసాం అనే ప్రచారం చేసి, ఐఏఎస్ ఆఫీసర్లలో అబధ్రతా భావం పెంచారని, ఇప్పుడు వచ్చిన కోట సిఎస్ కు వివరణ పంపించినా, ఆయన దీని పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాసం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వివరణ ఏదో, అప్పటి సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంకు ఇస్తే బాగుండేదని, అప్పటి వరకు అయినా, ఆయన్ను బదిలీ చెయ్యకుండా, ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, విశ్లేషకులు.

praveen 07112019 3

ఇది ఇలా ఉంటే, ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అయినా, కొత్త బాధ్యతలు తీసుకోలేదు. అందరికీ షాక్ ఇస్తూ, ఆయన వచ్చే నెల 6 వరకు సెలవు పై వెళ్ళిపోయారు. దాదపుగా నెల రోజుల పాటు సెలవు పై వెళ్ళటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన తదుపరి చర్య ఎలా ఉంటుందా అనే విషయం పై ఆరా తీస్తున్నారు. ఇంకా 5 నెలలకు పైగా సర్వీస్ ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను అర్ధాంతరంగా, కారణం లేకుండా బదిలీ చేయటం పై, ఆయన ట్రిబ్యునల్ కు వెళ్తారనే వాదన వినిపించింది. అయితే, ఎల్వీ సుబ్రమణ్యం, కేంద్ర పెద్దల వద్ద ఈ విషయం పై తేల్చుకునే పనిలో ఉన్నారని, ఆయన కేంద్ర సర్వీస్ లకు వెళ్ళే అవకాసం కూడా ఉందని, సమాచారం వస్తుంది. మరి, ఆయన తదుపరి అడుగు ఏమిటో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read