సోమశిల జలాల విడుదలలో డీఈలు అమ్ముడుపోయారంటూ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే సోమశిల నుంచి అనధికారికంగా 10 వేల క్యూసెక్కుల నీటిని ఎందుకు వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ "డక్కన్ ఏరియాకు ఈ మధ్య రెండో పంటకు నీరు ఇవ్వటం జరిగింది. లాక్ డౌన్ నేపధ్యంలో, మీటింగ్ పెట్టలేక పోవటంతో, కలెక్టర్ గారు అందరి ఒపీనియన్ తీసుకుని, అందరితో మాట్లాడి రెండో పంటకు నీరు ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది. సోమవారం రాత్రి, దాదాపుగా 10 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసారు. దాని వల్ల డైవర్షన్ రోడ్స్ అన్నీ కొట్టుకు పోయాయి. దీని పై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అంతా డెల్టా మీద పడే అవకాసం ఉంది. ఈ సోమశిల ప్రాజెక్ట్ లో ఉన్న డీఈలు అమ్ముడుపోయారు."

"ఏ నాయకుడుని అమ్ముడు పోయారో తెలియాల్సిన అవసరం ఉంది. 10 వేల క్యూసెక్కుల నీళ్ళు ఎవరు చెప్తే మీరు వదిలారు ? ఎక్కడకు వదిలారు ? ఏ నాయకుడు చెప్తే వదిలారు ? ఎందుకు వదిలారు ? ఉన్న రైట్స్ ప్రకారం ముందు డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి. దీని పై మంత్రిగారు, కలెక్టర్ తో మాట్లాడాను, ఎంక్వయిరీ వేసారు. దీని పై సమగ్రమైన విచారణ జరిపించాలి. ఏదో రిపోర్ట్ ఇచ్చాం అంటే సరిపోదు. దీనికి బాధ్యులైన డీఈలను సస్పెండ్ చెయ్యాలి. రాత్రికి రాత్రి 10 వేల క్యూసెక్కుల నీళ్ళు లేపారు అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ నాయకుడు చెప్తే ఇలా చేసారో, తెలియాలి. ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకుని, ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు". అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. దేవినేని ఉమా మాట్లాడుతూ "తెదేపా అనుమతులిచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం తిరిగి అనుమతులిచ్చి గొప్పలు పోతోంది. తెదేపా హయాంలో 25 ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఆపేశారు. వైఎస్ హయాంలో జలయజ్జ్ఞం ధనయజ్జ్ఞంగా భ్రష్టుపట్టిపోయిన ఇరిగేషన్ రంగంలో తెదేపా హయాంలో రమారమి రూ.63,373 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు చేశాం. చంద్రబాబు నాయకత్వంలో సమగ్ర జల విధానం తీసుకువచ్చాం. కోస్తాంధ్ర పట్టిసీమ, పురుషోత్తమపట్నం పోలవరం ప్రాజెక్టులో 70శాతం, వెలుగొండ, సంఘం నెల్లూరు ప్రాజెక్టులు , హంద్రీనీవా కాలువలు వెడల్పు చేసి చరిత్ర సృష్టించాం. హంద్రీ నీవా కాలువ తీసుకువెళ్ళు కియా పరిశ్రమ నెలకొనేలా చేశాం. కుప్పం దాకా నీళ్ళను తీసుకు వెళ్ళాం.. 805 అడుగుల వద్ద మచ్చుమర్రి లో నీళ్ళు లిఫ్ట్ చేసి హంద్రీనీవా, గాలేరి నగరి, పులివెందులకు నీళ్ళు ఇచ్చాం. పోతిరెడ్డిపాడు ద్వారా 400 టీఎంసీల నుంచి 500 టీఎంసీల నీళ్ళను రాయలసీమకు తరలించాం. రౌతునుబట్టే గుర్రం పరుగెడుతుంది. బుల్లెట్ దింపే మంత్రి జిల్లాలో నీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇదే అధికార యంత్రాంగాన్ని తాము అయిదేళ్ళు పరుగెత్తించాం, ప్రాజెక్టులను పూర్తి చేయించాం.
" అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read