అమరావతి రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్, రెండు రోజుల్లోనే పదవి పోగుట్టుకునే పరిస్థితికి వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిలో రైతుల గురించి మాట్లాడుతూ, వైసీపీ లైన్ ప్రకారమే, అందరి మంత్రులు అంటున్నట్టే, అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లతో పోల్చారు. అక్కడితో ఆగకుండా, ఇంకా ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నాకు తెలిసిన రైతులు అంటే, బురదలో ఉండాలి, బురదలో దొరికింది తినాలి, కాని ఇక్కడ అమరావతి రైతులు మాత్రం, మంచి మంచి చీరలు, మంచి ఫోన్లు, చేతికి బంగారపు గాజులు, మెడలో నల్ల పూసలు వేసుకుని తిరుగుతున్నారని, పృధ్వీ అన్నారు. దీంతో ఇది ఒక పెద్ద దుమారం అయ్యింది. వైసీపీ అధిష్టానానికి, జరిగిన డ్యామేజ్ అర్ధమైంది. దీంతో, డ్యామేజ్ కంట్రోల్ కోసం, పోసానిని రంగంలోకి దించారు. పృధ్వీని తిట్టించారు. అయినా, ప్రజల్లో వ్యతిరేకత పోలేదు. దీంతో, ఇక వైసీపీ, పృధ్వీని బహిష్కరిస్తారని, వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్త జరుగుతూ ఉండాగానే, పృధ్వీ సరసాల ఆడియో టేప్ బయట పడింది.

audio 18012020 2

దీంతో సాక్షాత్తు వెంకన్న సేవలో ఉంటూ, ఇదేమి గోల అంటూ, ప్రజల్లో ఇంకా వ్యతిరేకత వచ్చింది. అతను అలాంటి వాడు అని తెలిసినా, అలాంటి పదవి ఎందుకు ఇచ్చారు అంటూ, వైసీపీ పై విమర్శలు వచ్చాయి. దీంతో, అవకాసం కోసం చూస్తున్న వైసీపీ, పృధ్వీ పై చర్యలు తీసుకుంది. పృధ్వీ చేత, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేపించి, విజిలెన్స్ ఎంక్వయిరీ వేయించారు. అయితే, ఇక్కడ కధ మరో మలుపు తిరిగింది. ఈ కేసు పై విచారణ చేస్తున్న, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కొత్త కష్టాలు వచ్చాయి. దీంతో కేసు విచారణ ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు పృథ్వీ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు, ఎవరూ ముందుకు రాలేదు. చివరకు, ఆయన బాధితులుగా మీడియా ముందుకు వచ్చిన వారు కూడా, ఇప్పుడు ముందుకు రావటం లేదు.

audio 18012020 3

పృథ్వీ, అది చేసారు, ఇది చేసారు అంటూ, మీడియా ముందుకు వచ్చి చెప్పిన వారు, అలాగే అంతర్గతంగా సమాచారం ఇచ్చిన వారు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు కంప్లైట్ చేసేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఇక పృధ్వీతో, ఆడియోలో ఫోన్ సంభాషణ చేసిన మహిళ కూడా ఫిర్యాదు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ఇప్పటికే తాను అల్లరి పాలు అయ్యానని, ఇంకా ఈ పరిస్తితుల్లో కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, మీడియా ముందుకు రాలేను అంటూ, ఆమె కూడా వెనకడుగు వేస్తుంది. దీంతో ఈ ఆడియో సంభాషణ పై విచారణ ముందుకు వెళ్ళాలి అంటే, బాధితులు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read