శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ లో కొత్త వివాదం రేగింది. ఎస్వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో తెలియకుండా విడుదల చెయ్యటం, అది ట్రోల్ కావటం ఇందుకు కారణమైంది. మొన్న జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టంగా చక్రస్నానం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, పుష్కరిణిలో స్నానం చెయ్యటానికి, భక్తులు ఒకేసారి వచ్చి, అక్కడ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఆ రోజు మొత్తం 24 గంటల వ్యవధిలో ఎప్పుడు స్నానం చేసినా స్వామి వారు అనుగ్రహిస్తారని, పుణ్యం వస్తుందని ఒక ప్రోమో చెయ్యాలని ఎస్వీబీసీ ఛానెల్ నిర్ణయం తీసుకుని. ఇందు కోసం వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేనే పెద్ద ఆక్టర్ కదా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, ఎస్వీబీసీ చైర్మెన్ గా ఉన్న పృధ్వీరాజ్ బాలిరెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి, ఆ వీడియో చెయ్యాలని నిర్నయం తీసుకున్నారు.

prudvhi 14102019 2

ఈ ప్రోమో కోసం, ప్రజలకు సమాచారం ఇవ్వటానికి, తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో పుష్కరిణి నుంచి రికార్డింగ్ మొదలు పెట్టారు పృథ్వి. అయితే వివిధ భాషల్లో మాట్లాడే సమయంలో, పృథ్వి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక సార్లు చెప్పాల్సి వచ్చింది. ఉచ్ఛారణలో పొరపాట్లు దొర్లాయి. కొద్దిగా కామెడీగా కూడా చూసిన వారికి అనిపించింది. ఇంత ఇబ్బంది పడే బదులు, భాష తెలిసిన వారితో చెప్పించవచ్చు కదా, ఇంత పబ్లిసిటీ పిచ్చి ఏంటి అని ప్రజలు అనుకున్నారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు, పృధ్వీ నటించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీన్ గుర్తుకువచ్చింది. అయితే, ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి పృధ్వీరాజ్ బాలిరెడ్డిని నవ్వులపాలు చేశారని, ఇది కావాలనే చేసారని భావిస్తున్నారు.

prudvhi 14102019 3

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో పై పృధ్వీరాజ్ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన పై కావాలని కుట్ర చేస్తున్నారని, తనను నవ్వులు పాలు చేస్తున్నారని, ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఈ వీడియోని రికార్డు చేసిన తర్వాత వీడియోను ఓఎఫ్‌సీ ద్వారా స్టూడియోకు పంపించారు. ఆ సమయంలో లేదా ఎడిటింగ్‌ చేసేటప్పుడు వీడియో బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిటిడిలోని, విజిలెన్స్‌ లేదా పోలీసుశాఖ పరిధిలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ వీడియోని లీక్ చేసిన లీకువీరులను గుర్తించాలని ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే జరగబోయే ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పృధ్వీరాజ్ బాలిరెడ్డి కూడా విదేశాల్లో ఉన్నందున తిరిగి వచ్చిన తరువాత, ఈ విషయం పై చర్యలు తీసుకోనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read