తెలుగు సినీ ఇండస్ట్రీ, తెలుగు రాజకీయాలు, రెండిటికీ దగ్గర సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఏకంగా సియం అయ్యి, దేశ రాజకీయాలనే శాసించారు ఎన్టీఆర్. అలాగే అనేక మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారు పార్టీలు పెట్టారు. ఇలా తెలుగు సినిమాకు, రాజకీయాలకు ఎప్పుడూ దగ్గర సంబంధాలు ఉన్నాయి. అయితే సామాన్య ప్రజలు లాగానే, సినిమా వాళ్ళు కూడా, ఒక పార్టీ వైపు మొగ్గు చూపటం చాలా సహజం. ఎవరు అధికారంలో ఉన్నా, మనకు ఇష్టం లేని వాళ్ళు అధికారంలో ఉన్నా, వారికి గౌరవం ఇవ్వాల్సిందే. అయితే, వైసీపీ నేత, సినీ ఆర్టిస్ట్ పృధ్వీ మాత్రం, ఎందుకో కాని, మొదటి నుంచి, సినీ ఇండస్ట్రీకి, జగన్ మోహన్ రెడ్డికి గ్యాప్ పెంచటానికి, ప్రయత్నం చేస్తున్నాడు.

prudhvi 15082019 2

ఇది కావాలని ప్లాన్ ప్రకారం జరుగుతుందా, లేక తెలియని తనంతో, జగన్ మీద పిచ్చ అభిమానంతో చేస్తున్నాడో అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుని బాగా తిట్టినందుకు, జగన మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, 30 ఇయర్స్ పృధ్వీ కోసం, తిరుమల తిరుపతి దేవస్తానం ఛానల్ కు చైర్మెన్ గా చేసారు. ఈ సందర్భంలో, ఆ ప్రమాణస్వీకారం అయిన తరువాత, పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దల పై విరుచుకు పడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీ వాళ్లకు జగన్ అంటే గౌరవం లేదని, ఇప్పటి వరకు వచ్చి జగన్ ను ఎందుకు కలవలేదు, ఎందుకు సన్మానం చెయ్యలేదు అని పృధ్వీ ప్రశ్నించారు. దీని పై అగ్ర నటుడు రాజేంద్ర ప్రసాద్, తిరుమల వచ్చినప్పుడు స్పందించారు.

prudhvi 15082019 3

మేమేమీ పెట్టుబడిదారులం కాదని, జగన్ మోహన్ రెడ్డిని సియం అయిన సందర్భంగా అందరం అభినందించామని, అవసరం ఉన్నప్పుడు, ఆయన అవకాసం ఇచ్చినప్పుడు వెళ్లి కలుస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి ఈ మాటలో పృధ్వీ గారికి ఏమి తప్పు కనిపించిందో కాని, ఈ రోజు మరింతగా విరుచుకు పడ్డారు. జగన్ ను సినీ పెద్దలు కలిసి విష్ చెయ్యలేదు అని మాత్రమే తాను చెప్పానని పృథ్వీ తెలిపారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. . ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని హెచ్చరించారు. మొత్తానికి, లేని రచ్చను లేపి, సినీ ఇండస్ట్రీకి, ఏపి ప్రభుత్వానికి గొడవ పెట్టేలా ఉన్నాడు పృధ్వీ. జగన్ కలగ చేసుకుని, కొంచెం తగ్గమంటే కాని, ఈయన తగ్గేలా లేడు.

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read