వైఎస్ వివేక కేసు, రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి విచారణ మారగానే, ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది. గత కొంత కాలంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రాగానే, ఏపిలో విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల పైన అనేక రకాల ఒత్తిడులు పెట్టారు. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ కేసు తెలంగాణాకు బదిలీ అయ్యింది. అప్పటి నుంచి సిబిఐ స్పీడ్ పెంచింది. వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే అవినాష్ రెడ్డి మాత్రం, తనకు సమయం లేదని, అయుదు రోజుల తరువాత వస్తానని చెప్పారు. దీంతో సిబిఐ మళ్ళీ రెండో నోటీసు ఇచ్చింది. అవినాష్ రెడ్డి ఈ నెల 28న విచారణకు కావాలని రెండో నోటీసు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి సిబిఐ అధికారులు పులివెందుల బయలు దేరి వెళ్లారు. రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి సిబిఐ అధికారులు వెళ్లారు. అవినాష్ రెడ్డి అక్కడ లేకపోవటంతో, ఎక్కడికి వెళ్ళారో ఆరా తీసారు. అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించారు. ఇంకా ఆధికారులు అక్కడే ఉన్నారు. ఏమి జరుగుతుందా అని టెన్షన్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read