వైఎస్ వి-వే-క కేసు విచారణ మళ్ళీ మొదలైంది. ఇది మూడో విడత విచారణ. ఇందు కోసం నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం, విచారణ మొదలు పెట్టింది. ఈ రోజు విచారణ రెండో రోజు. కడప సెంట్రల్ జైలు ఆవరణలో, ఈ విచారణ కొనసాగుతుంది. పులివెందుల ప్రాంత ప్రజలను ఇక్కడ విచారిస్తున్నారు. నిన్న వి-వే-క డ్రైవర్ ని ప్రశ్నించారు. ఈ రోజు రెండో రోజు కూడా అతన్ని పిలిపించి విచారణ చేస్తున్నారు. అలాగే గతంలో వి-వే-క దగ్గర పని చేసిన కంప్యూటర్ ఆపరేటర్ ని కూడా పిలిపించారు. ప్రస్తుతం, డ్రైవర్ ని, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ ని ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరితో పాటుగా, మరి కొందరిని కూడా విచారణకు పిలుస్తారని తెలుస్తుంది. పులివెందుల ప్రాంతం నుంచి కొంత మందిని పిలుస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే నిన్న పగలు అంతా విచారణ చేసిన సిఐడి బృందం, నిన్న రాత్రి సిబిఐ బృందం పులివెందుల వెళ్లి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు రాత్రి పూట వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విచారణ సందర్భంగా ఎవరిని పిలవాలి ఏమిటి అనేది, ఒక రోజు ముందు మాత్రమే, స్థానిక పోలీసులు ద్వారా పిలిపిస్తారు. అయితే నిన్న రాత్రి మాత్రం, ఎవరికి ముందు చెప్పకుండా, పులివెందుల వెళ్లి రావటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

cbi 08062021 2

ఏమైనా కీలక సమాచారం దొరికిందా ? ఎవరైనా కీలక వ్యక్తుల వద్ద నుంచి సమాచారం తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో వి-వే-క కుమార్తె సునీత, పలువురి అనుమానితుల పేర్లతో ఒక లిస్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మహామహాలు ఉన్నారు. అయితే ఆమె ఇచ్చిన లిస్టులోని ప్రముఖులను మాత్రం, ఇప్పటి వరకు సిబిఐ విచారణ చేయకుండా ఉండటం పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఇదే విషయం పై సునీత, ఢిల్లీ వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు. అయినా ఇప్పటి వరకు ఆ ప్రముఖుల జోలికి సిబిఐ వెళ్ళాక పోవటం పై విమర్శలు వస్తున్నాయి. ఈ సారి అయినా సిబిఐ ఆ ప్రముఖలను పిలిపిస్తుందా, లేకపోతే కేవలం డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ లాంటి వారిని విచారణ చేసి వెళ్ళిపోతుందా అనేది చూడాల్సి ఉంది. గతంలో విచారణ చేసిన వారిని, చిన్న స్థాయి వ్యక్తులని కాకుండా, కీలక వ్యక్తులను, ప్రచారం జరుగుతున్న వ్యక్తుల పై కూడా విచారణ చేయాలని, దీని పై సిబిఐ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read