రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదే విధంగా హైకోర్టుని సోషల్ మీడియాలో దూషిస్తూ, కించపరిచిన కేసుకు సంబంధించి, సిబిఐ చేస్తున్న దర్యాప్తు కీలక దశకు చేరుకుంటుంది. ఈ రోజు సిబిఐ, ఈ కేసుకు సంబంధించి, ఒక అఫిడవిట్ ను రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ని పిటీషనర్ కు కూడా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అఫిడవిట్ లో కీలక సమాచారం ఉందని తెలుస్తుంది. మొత్తం వివరాలతో 26 పేజీల అఫిడవిట్ ని సిబిఐ డైరెక్టర్ జైస్వాల్ దాఖలు చేసారు. ఇటీవల కాలంలో పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలని చెప్పి, హైకోర్టు ఆదేశించిన సందర్భంలో, సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ, కేంద్ర హోం మంత్రి శాఖ ద్వారా విదేశాల్లో ఉంటున్న పంచ్ ప్రభాకర్, అలాగే మరి కొంత మంది పై లుక్ అవుట్ సర్క్యులర్ లు జారీ చేసామని అందులో పేర్కొన్నారు. ఈ లుక్ అవుట్ సర్క్యులర్ల ఆధారంగా ఇంటర్ పోల్ బ్లూ నోటీసులు జారీ చేయటం, ఆ బ్లూ నోటీసులు ఆధారంగా అతని అడ్డ్రెస్ లు తీసుకుని, ఫెడరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎఫ్బిఐ , ఇండియాలో ఉన్న సిబిఐ, పంచ్ ప్రభాకర్ అడ్డ్రెస్ తమకు పంపించిందని, సిబిఐ కోర్టుకు తెలిపింది. ఎఫ్బిఐ ఇచ్చిన వివరాలను కూడా సిబిఐ అఫిడవిట్ లో పెట్టి, హైకోర్టుకు సమర్పించింది. ఇది కీలక పరిణామం అనే చెప్పాలి.

punch 25112021 21

ఎఫ్బిఐ ఇచ్చిన సమాచారం మేరకు, స్థానికంగా ఉండే కోర్టులో అరెస్ట్ వారెంట్ తీసుకుని, ఆ అరెస్ట్ వారెంట్ ఆధారంగా అతనికి సంబంధించి, ఇంటర్ పోల్ కి మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పంపించామని, అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ కి రిక్వెస్ట్ పెట్టినట్టు కోర్టుకు తెలిపింది సిబిఐ. ఇక దీంతో పాటుగా, ఈ మొత్తం కేసులో, మొత్తం 16 మందిన నిందితులుగా పేర్కొనగా, ఇప్పుడు పంచ్ ప్రభాకర్ ని 17వ వ్యక్తిగా చార్జ్ షీట్ లో, సిబిఐ పెట్టింది. ఇక ఈ కేసుకు సంబంధించి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ని కూడా విచారణ చేసినట్టు సిబిఐ తెలిపింది. సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నాం అని, దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు ఇస్తామని పేర్కొంది. అలాగే వైసీపీ సోషల్ మీడియా సెల్ కి సంబంధించి కీలక వ్యక్తులను కూడా విచారణ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే మళ్ళీ సోషల్ మీడియాలో పంచ్ ప్రభాకర్ మళ్ళీ వీడియోలు పెట్టటం పై, యూట్యూబ్ కు తీసేయమని కోరినట్టు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read