నరసాపురం ఎంపీ, వైసీపీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. పార్లమెంట్ మొదలైన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలితో, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతుంది. రఘురామ కృష్ణంరాజు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, ఇలా వద్దు అంటూ జగన్ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు, వార్తలు కూడా వచ్చాయి. ఢిల్లీలో ఎవరిని కలవాలి అన్నా, ముందు విజయసాయి రెడ్డితో చెప్పి, తరువాతే వెళ్ళాలని చెప్పినా, రఘురామ కృష్ణంరాజు మాత్రం, ఆయన పంధాలోనే వెళ్తున్నారు. పార్లమెంట్ మొదటి రోజు, తెలుగు భాష పై ప్రశ్న అడగి, ఇక్కడ వైసీపీని డిఫెన్సు లోకి నెట్టారు. తరువాత ఏకంగా ప్రధాని మంత్రి మోడీకి పాదాభివందనం చేసారు. తరువాత వివిధ కేంద్ర మంత్రులను కలిసారు. అయితే వీటి అన్నిటి పై, జగన్ కు వివరణ కూడా ఇచ్చారు. అయినా కూడా వైసీపీ, రఘురామ కృష్ణంరాజు వైఖరి పై, కొంత అసంతృప్తిగానే ఉంది. అయితే, మరోసారి రఘురామ కృష్ణంరాజు వార్తల్లో నిలిచారు.

raghu 30112019 2

ఈ సారి ఏకంగా, బీజేపీ హైకమాండ్ కూడా రఘురామ కృష్ణంరాజు గారిని వెల్ డన్ అంటూ మెచ్చుకుంది. బీజేపీ ఒక్కటే కాదు, అన్ని పార్టీలు మేచ్చుకున్నాయి. బీజేపీ కూడా చెయ్యలేని పనిని రఘురామ కృష్ణంరాజు చేసి చూపించి, బీజేపీ పెద్దలు ఊపిరి పీల్చుకునేలా చేసారు. ఇంతకీ ఏమి జరిగింది అంటే, బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌, గాంధీని చంపిన, నాథూరామ్‌ గాడ్సేను దేశభక్తుడిగా పొగుడుతూ, వివాదానికి తెర లేపారు. అయితే ప్రతిపక్షాలతో, సొంత పక్షం నేతలు కూడా, ఆమె వైఖరి పై నిరసన వ్యక్తం చేసారు. దీంతో ఈ వివాదం ఎలా ముగించాలా అని బీజేపీ పెద్దలు మదన పడుతున్న వేళ, ఆ వివాదాన్ని కొలిక్కి తేవడంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చూపించిన చొరవతో, వివాదం పరిష్కారం అయ్యి, బీజేపీ పెద్దలను ఊపిరి పీల్చుకునెలా చేసింది.

raghu 30112019 3

ప్రజ్ఞా క్షమాపణ కోసం శుక్రవారం పార్లమెంటులో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసాయి. పార్లమెంట్ నడిచే పరిస్థితి లేకపోవడంతో, స్పీకర్ సభ వాయిదా వేసి, అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ నుంచి, లోక్‌సభ నాయకుడు మిథున్‌రెడ్డి కాకుండా, రఘురామకృష్ణంరాజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రజ్ఞాతో క్షమాపణ చెప్పించే విషయమై బీజేపీ అధిష్టానం, నాయకులు చాలాసేపు తర్జనభర్జనపడ్డారు. అది గమనించిన రఘురామకృష్ణంరాజు, పార్లమెంట్ లో వద్దు కాని, అఖిలపక్ష నాయకుల ఎదుట క్షమాపణ చెప్పేలా సాధ్వీని ఒప్పించారని, దీంతో ఈ వివాదం ముగుసిందని సమాచారం. ఆ సమావేశం నుంచి బయటకొచ్చిన పలు పార్టీల సభ్యులు, ముఖ్యంగా బీజేపీ అధిష్టానం, రఘురామకృష్ణంరాజును అభినందించారు. సొంత పార్టీ నేతలా వ్యవహరించినందుకు, ధన్యవాదాలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read