వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, గత రెండేళ్లుగా, సొంత ప్రభుత్వం పై తిరుగుబావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన విధానాల పై రఘురామకృష్ణం రాజు విరక్తి చెంది, ప్రభుత్వంలో జరిగే ప్రతి తప్పుని, మీడియా సమావేశాల్లో ఎండగడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే, రఘురామరాజుకి, జగన్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. జగన్ మోహన్ రెడ్డి, రఘురామరాజుని పర్సనల్ గా టార్గెట్ చేసే వరకు వ్యవహారం వెళ్ళింది. రఘురామరాజు పై రాజ ద్రోహం కేసు పెట్టి, ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, గుంటూరుకు తీసుకుని వచ్చి, ఆయన్ను కొట్టి, హింసించారు. ఈ కేసు దేశంలోనే పెద్ద సెన్సేషన్ అయ్యింది. రఘురామరాజు ఒక ఎంపీ కావటంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తరువాత రఘురామరాజు, దీని పై సుప్రీం కోర్టులో పోరాటం కూడా చేస్తున్నారు. ఇక, రఘురామరాజుని ఎలాగైనా పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలని జగన్ మోహన్ రెడ్డి ఎత్తులు వేసారు. అయితే అది కూడా ఫ్లాప్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలు ఫలించలేదు. అయితే రఘురామరాజు పై ఏదో ఒక కేసు పెట్టి, ఆయన్ను మళ్ళీ లోపల వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, రఘురామరాజు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడతారా అని జగన్ మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు.

rrr 18062022 2

అయితే గతంలో నాలుగు నెలల క్రితం, రఘురామరాజు, ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేయగా, అయన పై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు. అవి కోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలోనే, వచ్చే నెల 4వ తేదీన, ప్రధాని మోడి, ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజుకి సంబంధించి, జరిగే ఒక ఈవెంట్ లో, ప్రధాని పాల్గుననున్నారు. ఈ సమావేశంలో తాను కూడా పాల్గునాలని రఘురామరాజు భావించారు. అయితే రఘురామరాజు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ, ఆ రోజు అరెస్ట్ చేసే ప్లాన్ వేయటంతో, రఘురామరాజు, ఈ విషయం పై తెలివగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. తాను స్థానిక ఎంపీ హోదాలో ప్రధానితో కలిసి కార్యక్రమంలో ఉంటానని, ప్రధాని కార్యాలయానికి చెప్పటం, అలాగే హోం మంత్రి అమిత్ షా దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవటంతో, ఆయన ప్రధాని మోడితో కలిసి ఆ రోజు ఏపిలో పర్యటన చేయనున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మోడీ పక్కన ఉండగా, రఘురామరాజు ని అరెస్ట్ చేస్తుందా ? చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read