రఘురామకృష్ణం రాజు, ఢిల్లీలో బిజీ బిజీగా గడ్పుతున్నారు. నిన్న రెండు గంటల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో గడిపిన రాజు గారు, నిన్న రాత్రి పార్లమెంట్ స్పీకర్ ని కలిసారు. ఈ రోజు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, అలాగే మరో కేంద్ర మంత్రి రాజ్ నాధ సింగ్ ని కలిసారు. వీరి ముగ్గురితో మాట్లాడిన తరువాత, రఘు రామరాజు మీడియాతో మాట్లాడారు "నేను ఎంపీ పదవికి ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేశాను. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది. రాజ్యాంగానికి లోబడి, బాధ్యత నేను నిర్వహిస్తే, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం అని చెప్పే ఒక రాజకీయ పార్టీ నుంచి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ నేను చేసిన వ్యాఖ్యల పై నోటీసులు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇటు వంటి క్లిష్ట సమస్యలు ఉన్నాయి. అయితే సారద్ యాదవ్ గారిని ఉదాహరిస్తూ, కొంత మంది నన్ను టార్గెట్ చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళే, కొంత మంది కుట్ర చేస్తున్నారని అర్ధం అవుతుంది. సరద్ యాదవ్ గారి కేసు వేరు, నా కేసు వేరు. సరద్ యాదవ్ గారు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ర్యాలీలు చేసారు. నేను ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా, ప్రవర్తించాను. మా ముఖ్యమంత్రి గారిని కలలో కూడా నేను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. పార్టీని కూడా ఎప్పుడూ ఏమి అనలేదు. మా మంత్రులే ఇసుక మీద స్పందించారు. ఇసుక మాయం అవుతుంది అని మంత్రి పెద్దిరెడ్డి గారే అన్నారు. అందుకే నేను కూడా వాటి పై చర్యలు తీసుకోమని కోరాను. పార్టీని కాదు ప్రభుత్వాన్ని కోరాను. సూచనలు చేశాను."

"ఇక్కడ అందరూ గుర్తుంచుకావాల్సింది ఏమిటి అంటే, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కొన్ని సార్లు ప్రభుత్వంలో, అనేక పార్టీలు కలిసి ఉంటాయి. కాని పార్టీ వేరు. పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. పార్టీ సభ్యుడిగా పార్టీని ఏనాడు విమర్శించలేదు. ప్రభుత్వానికి మాత్రం సలహాలు ఇచ్చాను. 80 శాతం హిందువులు మనోభావాలు గుర్తిస్తూ, వెంకన్న ఆస్తులు అమ్మవద్దు అని కోరాను. అది పాలకవర్గ నిర్ణయం, దాన్ని విబేధిస్తే పార్టీని దిక్కరించాను అన్నారు. అయితే కొంత మంది మా ఎమ్మెల్యేలు నా పై తిరుగు బాటు చేసారు. ఎవరి ఆదేశాలు మేరకు చేసారో తెలియదు, కాని కొంత మంది మా ఇంచార్జ్ అయిన వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు అని అంటున్నారు. అయితే ణా దిష్టి బొమ్మలు తగలబెట్టి, నన్ను బెదిరింపులు చేసి, హడావిడి చేసారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. అందుకే నేను, కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ కావాలని కోరారు. పార్లమెంట్ స్పీకర్ గారికి వినతి ఇచ్చాను. ఇవన్నీ మాట్లాడటానికి ఢిల్లీ వచ్చాను. "

"నిన్న స్పీకర్ ని కలిసాను, ఈ రోజు కిషన్ రెడ్డి గారిని కలిసి ఈ విషయం చెప్పను. అలాగే రాజనాద్ సింగ్ గారికి గౌరవ ప్రదంగా కలిసాను. నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసి, కొన్ని రూల్స్ తెలుసుకున్నాను. ఇంకా ఎవర్ని అయినా కలవాల్సి వస్తే కలుస్తాను. ఎవర్ని కలుస్తానో చెప్పలేను కాని, అవసరం అయితే కలుస్తాను. అయితే, షోకాజ్ కి రిప్లై ఇవ్వాలా, లేక జగన్ గారికి వివరణ ఇవ్వాలా అనేది చూస్తున్నా. పార్టీని ఏమి అనకపోయినా, వారికి కావాల్సిన సోషల్ మీడియాలో, వారి సమాజికవర్గ గ్రూపులలో నా పై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, నేను క్రమశిక్షణతో ఉన్నాను, మీరు ఎన్ని రాతలు రాపించినా, నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు, జగన్ గారిని ఏమి అనబోను. ఇటువంటి ప్రయత్నాలు ఆపండి. ప్రజలు గమనిస్తున్నారు. జగన్ కు నాకు, గ్యాప్ తేకండి అని మరొక్కసారి, విజయసాయి రెడ్డి గారిని అర్ధం చేసుకోవాల్సిందిగా కోరుతూ, నోటీసుని విత్ డ్రా చేసుకోమని కోరుతున్నాను" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read