ప్రభుత్వం, పేదలకు ఇస్తున్న ఇళ్ళ స్థలాల విషయంలో, కొంత మంది లంచాలు అడుగుతున్నారు అని తెలుస్తుంది అంటూ, ఏకంగా అధికార పార్టీ ఎంపీ సేల్ఫీ వీడియో చెయ్యటం సంచలనంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు, దీనికి సంబంధించి, ఒక సేల్ఫీ వీడియో పోస్ట్ చేసారు. ఆయన ఏమి అన్నారంటే "ప్రజల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ఇళ్ల స్థలాల అందరికీ ఇల్లు ఉండాలి, అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది అది అందరికీ తెలుసు. అంతా కూడా, ఈ కార్యక్రమం చాలా చోట్ల జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల స్థలాలు అలాట్ చేయాలి అంటే లబ్దిదారుని చాలాచోట్ల డబ్బులు అడుగుతున్నారు. ఫ్లాట్ 20 వేల నుంచి సుమారు 60 వేల వరకు కూడా డబ్బులు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, అని కొన్ని కంప్లైంట్లు నా వద్దకు కూడా రావటం జరిగింది. దీన్ని నేను మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగింది. దీని మీద తక్షణం, ఇందులో ఏ మాత్రం నిజం ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది."

"ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా కూడా, అలాట్ చేయటానికి, ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి, లేదా డైరెక్ట్ గా అయినా సరే కలెక్టర్ గారికి, మీరు ఒక పిటీషన్ ఇచ్చి, పలానా గ్రామంలో, పలానా వ్యక్తి మమ్మల్ని, ఈ లాండ్ అలాట్ చెయ్యటానికి, మమ్మల్ని ఇంత డబ్బులు డిమాండ్ చేశారు, మేం అంత డబ్బులు ఇచ్చాను అని చెప్తే, ఇచ్చిన వాళ్ళు ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుపట్టడం జరగదు. మీ డబ్బు మీకు వెనక్కి ఇచ్చి, ఆ ఫ్లాట్ కూడా మీకు అలాట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, కొన్ని దశాబ్దాల పాటు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగ నిలిచిపోవాలన్న కోరికకు, కొంతమంది కావాలని చెప్పి తూట్లు పొడుస్తున్నట్లుగా అర్థం అవుతోంది, ఈ డబ్బులు డిమాండ్ చెయ్యటం అంటే. దయచేసి ఎవరూ కూడా, ఏ ఒక్కరూ కూడా ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డిమాండ్ ఉంటే, అటువంటి డీటెయిల్స్ అన్నీ, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేదా రేపు తెలియచేయ బోయే ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి, మీరు చెప్తే, తగిన చర్యలు తీసుకొని, మీకు ఫ్లాట్ అలాట్ చెయ్యటం జరుగుతుంది అని అన్నారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read