వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. షోకాజ్ నోటీసుకి సమాధానం ఇస్తారు అనుకున్న సమయంలో, అది కాకుండా, జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు రఘురామకృష్ణం రాజు. విజయసాయి రెడ్డి తనకు పంపించిన నోటీసును, ఆ లేఖలో ప్రస్తావించారు రఘురామకృష్ణ రాజు. విజయసాయి రెడ్డి తనకు ఇచ్చిన నోటీసులో, లెటర్ హెడ్ చూస్తే, మన పార్టీది లాగా లేదని అన్నారు. మన పార్టీ వైఎస్ఆర్ పేరును ఉపయోగించోద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ పేరుకు బదులు, మరో పేరుతో ఉన్న లెటర్ హెడ్ తో తనకు నోటీసు ఇచ్చారని అన్నారు. వెంకటేశ్వర స్వామీ భక్తుడిగానే నేను తిరుమల తిరుపతి దేవస్థానం భూములు వేలం పై స్పందించానని అన్నారు. మీ కోటరీ నా పై, క్రీస్టియన్ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పైనా కొందరు నా వ్యాఖ్యలని వక్రీకరించారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని నేను కలవాలి అనుకుంటున్నాను, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే రఘురామరాజు లేఖ విడుదలకు ముందు, ప్రధాని మోడీ పై, అనుకూలంగా ఉన్న ఒక ఆడియో సంగ్ ని కూడా ఆయన విడుదల చేసారు. సోషల్ మీడియాలో కూడా దాన్ని షేర్ చేసారు. చైనాతో కనుక మనకు యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో మోడీ గెలుస్తారు అంటూ, పాట సాగుతుంది. అయితే దీని పై కొందరు స్పందిస్తూ, రఘురామకృష్ణ రాజు, బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే దీని పై స్పందించిన రఘురామరాజు,తనకు ఇద సినీ పరిశ్రమలో పని చేసే ఒక మిత్రుడు ఫార్వర్డ్ చేసారని, అదే నేను అందరికీ ఫార్వర్డ్ చేసానని, ఇలాంటి క్లిష్ట సమయంలో, ప్రధానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని, దాంట్లో తప్పు ఏమి ఉంది అంటూ ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు ఈ ఆడియోతో పాటు, జగన్ కు రాసిన లేఖ పై, జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read