నర్సాపురం వైసీపీ ఎంపీ, రఘురామ కృష్ణ రాజు, ఈ రోజు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, తమ భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా టిటిడి భూములు అమ్మటం విషయం పై, రఘు రామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. వెంకటేశ్వర స్వామి విషయం, టిటిడి ఇష్టం కాదని, భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. నన్ను కనుక సలహా అడిగితే, వెంకన్న విషయంలో, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తానని అన్నారు. వెంకటేశ్వర స్వామీ అంటే భక్తితో పాటు భయం ఉందని అన్నారు. దేవస్థానం భూములు అమ్మటానికి లేదని, ఇంతకు ముందు హైకోర్ట్ ఆర్డర్ ఉందని, మరి ఇప్పుడు టిటిడి ఎలా నిర్ణయం తీసుకుందో అని అన్నారు. భక్తులు దానం చేసిన భూమి అమ్మాలి అనుకుంటే, ఆ దానం ఇచ్చిన వారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భక్తుల మనోభావాలు నాకు అనవసరం, నేను ఏది చేసిన చెల్లుతుంది అంటే కుదరదు అని అన్నారు.

ఈ నిర్ణయం అనవసరంగా తీసుకుంది ఏమో అని అన్నారు. ఒక పక్క ప్రభుత్వాలు పెత్తనం, గుడి మీద ఉంది అనుకున్న సమయంలో, ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదని అన్నారు. ఒక వెంకటేశ్వర స్వామీ భక్తుడిగా, ఈ నిర్ణయం నేను సమర్ధించను అని రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఇక మధ్య పాన నిషేధం పై మాట్లాడుతూ, షాపులు తగ్గించినంత మాత్రాన, మధ్యపాన నిషేధం జరగదని అన్నారు. రెండు చోట్ల ఉండే చోట, ఒక చోట వచ్చి తాగుతారని అన్నారు. చేస్తే పూర్తిగా చెయ్యాలని, అంతే కాని, ఇలా షాపులు తగ్గిస్తే మధ్య నిషేధం అవ్వదు అని అన్నారు. అలాగే 2024లో సీటు వస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తానని, నాకు సీటు ఇవ్వకపోయినా పోటీ చేస్తాను అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు.

క-రో-నా సహాయం విషయంలో, జగన్ దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగి హడావిడి చేస్తేనే కాదని, తాను కూడా సైలెంట్ గా, ఎవరికీ ఇబ్బంది లేకుండా, రోజుకి రెండు ఊరులు చొప్పున సహాయం చేసానని, రఘురామకృష్ణ రాజు స్పష్టం చేసారు. అలాగే కేంద్ర మంత్రి పదవి పై ఇప్పటికి ఆశ లేదని, నాకు ఉన్నది చాలని, మంచి పదవి వస్తే, ప్రజలకు మరింత సేవ చెయ్యాలని, తనకు ఆశయం ఉందని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి, జగన్ మోహన్ రెడ్డికి పోల్చి, మీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని అడగగా, రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్రెండ్ అని, ఆయన లీడర్ కాదని, జగన్ మోహన్ రెడ్డి ఫ్రెండ్ కాదని, లీడర్ అని అన్నారు. ఒక ఫ్రెండ్ కు ఉన్న ఎమోషన్, లీడర్ తో ఉండదు కదా అని, రఘు రామ కృష్ణ రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read