జగన్ మోహన్ రెడ్డికి కొరకారని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఈ రోజు ఢిల్లీ వెళ్ళటం, చర్చనీయంసం అయ్యింది. ఒక పక్క వైసీపీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం, మరో పక్క ఆ షోకాజ్ నోటీస్ చెల్లదు అంటూ రఘురామ కృష్ణం రాజు చెప్పటం, ఆ తరువాత రోజే ఆయన ఢిల్లీ వెళ్ళటం చర్చనీయాంసం అయ్యింది. ఢిల్లీ వెళ్ళటంతోనే, రఘురామకృష్ణం రాజు, కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లారు. వైసీపీ నుంచి, ఆ పార్టీ రాజ్యసభ సాభ్యుడు విజయసాయి రెడ్డి తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వటం పై, నిన్న రఘురామకృష్ణం రాజు సీరియస్ అయిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు, విజయసాయి రెడ్డి హోదా పై, నిన్న రాసిన లేఖలో రఘురామకృష్ణం రాజు, ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ విజయసాయి రెడ్డి నోటీసు ఇవ్వటం పై, రఘురామ రాజు అభ్యంతరం వ్యక్తం చేసారు. అలాగే గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడ ఉపయోగించకూడదు అని ఆదేశాలు ఉన్నా, విజయసాయి రెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసు లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఉండటాన్ని, రఘురామకృష్ణం రాజు తప్పుబట్టారు.

అలాగే తమ పార్టీలో, నిబంధనలు ప్రకారం, అసలు క్రమశిక్షణా కమిటీనే లేదని, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని అన్నారు, రఘురామకృష్ణం రాజు. అలాంటిది, విజయసాయి రెడి తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వటం చట్టబద్దత కాదు అంటూ, రఘురామకృష్ణం రాజు చెప్తున్నారు. ఈ అంశాలు అన్నిటి పై, రఘురామకృష్ణం రాజు, ఈ రోజు కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి, తనకు ఇచ్చిన నోటీసులు, జరిగన పరిణామాలు, రూల్స్ కు వ్యతిరేకంగా తమ పార్టీ నడుస్తుంది అంటూ, సొంత పార్టీ పైనే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే, ఎన్నికల కమీషనర్ ను కలిసిన తరువాత, కొంత మంది బీజేపీ పెద్దలను కూడా రఘురామకృష్ణం రాజు కలిసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పార్లమెంట్ స్పీకర్ కు కూడా ఆయన తనకు కేంద్ర బలగాలతో భద్రత కావాలి అంటూ, ఇప్పటికే లేఖ రాసారు. దీని పై కూడా ఆయన, స్పీకర్ ను కలిసే అవకాసం ఉందని, అలాగే కేంద్ర హోం శాఖ వర్గాలను కూడా, ఆయన కలిసి, రాష్ట్రంలో తన పై వస్తున్న బెదిరింపులు పై, ఫిర్యాదు చేయ్యనున్నట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read