ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కు టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌ స్వాగతం పలికారు. ఏపీ పర్యటనకు ముందు రాహుల్‌ ఏపీ భవన్‌ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న తిరుపతిలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ చేపట్టింది. ఈ యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఈ నెల 19 నుంచి 13 జిల్లాల్లో ప్రత్యేకహోదా భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా 22న రాహుల్‌గాంధీ వస్తున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అమలు చేస్తానని ప్రధాని మోడీ మాట ఇచ్చి తప్పిన ప్రాంతమైన తిరుపతిలోనే రాహుల్‌ ప్రత్యేకహోదా భరోసా యాత్ర లో పాల్గొననుండడం విశేషం.

rahul 19022019 2

ఇక ఎన్ని కలు సమీపిస్తున్న వేళ.. ప్రజల్లోకి చొచ్చు కు వెళ్లేందుకు గాను కాంగ్రెస్‌ సమస్త అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర విభజన పాపాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్‌ 2014లో మట్టికరచింది. అప్పటితో పోలిస్తే ఇపుడు కొంతమేర పరిస్థితి మెరుగుపడిందన్న విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో యూపీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానిగా రాహుల్‌గాంధీ తొలి సంతకం ఏపీకీ ప్రత్యేక హోదాపైనే ఉంటుందని స్వయంగా రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కాంగ్రెస్‌ కొంతమేర ముందుకు వెళ్లింది. ఇదే క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో మంగళవారం నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది.

rahul 19022019 3

ఈ సందర్భంగా 13 జిల్లాల నుంచి కాంగ్రెస్‌ నేతలు అనంతపురానికి ఇప్పటికే చేరుకున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 13 రోజుల పాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర మార్చి 3వ తేదీన ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోమీటర్ల పొడవునా జరుగనున్న ఈ యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 22వ తేదీన తిరుపతి రానున్నారు. రాహుల్‌ రాక సందర్భంగా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రారంభమయ్యే భరోసా యాత్రకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమన్‌చాందీ, కర్ణాటక మంత్రి శివకుమార్‌ , ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్‌తో పాటు ఏపి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హాజరవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read