ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టింది. మరీ ముఖ్యంగా రాయలసీమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, ప్రభుత్వం అసమర్ధతతో, ప్రజలు అల్లాడిపోతున్నారు. మొన్నటి వర్షాలు, వరదలు మర్చిపోక ముందే, ఇప్పుడు మరోసారి ఏపికి వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ, వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షాలు ఉంటాయని, రేపు కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పటంతో, రేపు స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించారు. ఇప్పటికే అనేక చోట్ల వర్షం భారీగా పడుతుంది. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు ఇప్పటికే పడుతున్నాయని తెలుస్తుంది. పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. అనేక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొన్న జరిగిన విధ్వంసం తలుచుకుని కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ వర్షాల వల్ల, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read