తిరుమల శ్రీవారి లడ్డూ అంటే, ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూని, ప్రసాదంగా భావించి, శ్రీవారి భక్తులు ఆ లడ్డూ కోసం, ఆరాట పడుతూ ఉంటారు. శ్రీవారి తరువాత, ఆ లడ్డూ అంటే అంత పవిత్ర భావం హిందువులకు ఏర్పడింది. అయితే తాజాగా టిటిడి తీసుకున్న ఒక నిర్ణయంతో, పలు విమర్శలు వస్తున్నాయి. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని, ప్రతి చోట అమ్ముతాం అని, చెప్పటం అభ్యంతరాలకు తావు ఇస్తుంది. పవిత్రమైన పసాదాన్ని, ఒక స్వీట్ లాగా అమ్మటం ఏమిటి అంటూ, పలువురు ప్రశ్నిస్తున్నారు. 50 రూపాయలు ఉండే లడ్డూ, 25 రూపాయలకు తగ్గించి అమ్మటం పై, కూడా విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎక్కువగా టిటిడి లడ్డూలు కావాలని చెప్తే, తమను సంప్రదించాలని చెప్పటం, వివాదాస్పదం అయ్యింది. అయితే ఈ విషయం పై, టిటిడి గౌరవ ప్రధాన అర్చుకులు రమణ దీక్షితులు కూడా అభ్యంతరం చెప్పారు. ఆయన కూడా అభ్యంతరం చెప్పారు అంటే, ఈ నిర్ణయం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రమణ దీక్షితులు మాట్లాడుతూ, తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం, స్వామి వారి దర్శనం తరువాత, ప్రసాదాలు ఇస్తారు, ఇది ధర్మం. అంతే కాని, దర్శనాలు చెయ్యకుండా, ఎక్కడ పడితే అక్కడ, కౌంటర్ పెట్టి అమ్మటం అని చెప్పటం, ఎక్కువ సంఖ్యలో కావలి అంటే ఆర్డర్ ఇస్తే ఇస్తాం అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, ఇది చాలా తప్పుడు నిర్ణయం అని అన్నారు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలియదు కాని, ఇది చాలా తప్పు అని రమణ దీక్షితులు అన్నారు. ఆగమ శాస్త్రం గురించి ఆలోచించకుండా, ఇలా చెయ్యటం, ప్రభుత్వం మీద ఒక మచ్చలాగా ఏర్పడుతుంది అని రమణ దీక్షితులు అన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఒక చెడ్డ పేరు తెచ్చేలా ఉందని, రమణ దీక్షితులు అన్నారు.

ఆగమ శాస్త్ర పండితులు దగ్గర సలహాలు తీసుకోకుండా ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు అని అన్నారు. శ్రీవారి లడ్డూతో వ్యాపారం చెయ్యటం, చాలా తప్పు అని అన్నారు. ఎక్కడైనా స్వామి వారిని దర్శించుకుని, తరువాత ప్రసాదం ఇవ్వాలని, అలా కాకుండా, ఇలా వ్యాపారం చెయ్యటం, సమంజసం కాదని, తమను కనుక సలహాలు అడిగి ఉంటే, మేము కచ్చితంగా ఇవి ఒప్పుకునే వారం కాదని రమణ దీక్షితులు అన్నారు. స్టాక్ ఎక్కవు అయిపోయే, తక్కు రేటుకి అమ్మటం, భక్తుల మనోభావాలు దెబ్బ తినటమే అని అన్నారు. అడ్మినిస్ట్రేషన్ విషయాలు కొన్ని ఉన్నాయని, వారు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం అభ్యతరం అని చెప్తున్నానని, టిటిడి ఇప్పటికైనా ఈ నిర్ణయం పై పునరాలోచించాలని రమణ దీక్షితులు అన్నారు. పూర్తీ ఇంటర్వ్యూ ఇక్కడ వినవచ్చు https://youtu.be/zhRbpgCDRpA

Advertisements

Advertisements

Latest Articles

Most Read