తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో తిరుమల ప్రతిష్ట దెబ్బ తీస్తూ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి, అప్పట్లో తిరుమలని రాజకీయ వేదికగా వాడుకున్న రమణ దీక్షితులు, వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లేని పింక్ డైమండ్ ఉన్నట్టు, నెలమాళిగలు తవ్వినట్టు, శ్రీవారి నగలు చంద్రబాబు తన ఇంట్లో దాచుకునట్టు, శ్రీవారి హుండీలో డబ్బులు వేయకండి దోచేస్తున్నారు అంటూ గతంలో రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం పై అప్పట్లో టిటిడి తీవ్రంగా పరిగణించి, రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి పై 200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తిరుమల వ్యవహారం, స్వామి వారి ప్రతిష్ట కావటంతో, తీవ్రంగా స్పందించారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అప్పట్లో చేసిన ఆరోపణలు నిరూపించి, తాము చేసిన వ్యాఖ్యలు నిజం అని చెప్పాల్సింది పోయి, అవేమి చేయకుండా కూర్చుకున్నారు. ఇక మరో పక్క జగన్ బాబాయ్ చైర్మెన్ గా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు పై, గతంలో వేసిన పరువు నష్టం దావా పిటీషన్ వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు, ఈ రోజు ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. పాలకమండలిలో ఇప్పటికే ఈ విషయం పై తీర్మానం కూడా చేసాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఈ పిటీషన్ కోసం, 2 కోట్లు కోర్టులో డిపాజిట్ చేసారు. ఇప్పుడు పిటీషన్ వెనక్కు తీసుకుంటే, ఈ 2 కోట్లు టిటిడి కోల్పోవాల్సి ఉంటుంది. నిజాలు తేల్చకుండా, టిటిడి ఇలా చేయటం పై, పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. శ్రీవారి హుండీలు డబ్బులు వేయవద్దు, శ్రీవారి నగలు ఎవరో ఇంట్లో ఉన్నాయి అంటూ చేసిన వారిని, వదిలి పెట్టటం పై అభ్యంతరం తెలుపుతున్నారు.

ఈ విషయం పై, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే అని, అది హోదా కాదని, భక్తులు ఇచ్చే డబ్బులని కాపాడాల్సిన బాధ్యత వీరి పై ఉందని అన్నారు. గతంలో టిటిడి మీద అసత్య ఆరోపణలు చేసారని, రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి పై, పరువు నష్టం దావా వేసారని, 200 కోట్లకు పరువు నష్టం దావా వేసి, 2 కోట్లు కట్టారని, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఆ పరువు నష్టం దావాను వెనక్కు తీసుకుందని, కట్టిన డబ్బు రెండు కోట్ల రూపాయాలు వదులుకోవటానికి కూడా సిద్ధం అయ్యారని, ఇప్పుడు వెనక్కు తీసుకున్నారని, ఈ డబ్బులు ఎవరు కడతారని అడిగారు. అందరూ కలిసి ఆ డబ్బులు, వడ్డీతో సహా జమ చేసి, మీ కేసులు వెనక్కు తీసుకోవాలని అన్నారు. రాజకీయ వేదికకు శ్రీవారితో ఆటలు వద్దని అన్నారు. శ్రీవారి హుండీలో డబ్బులు వేయవద్దు అని చెప్పిన రమణ దీక్షితులు, 40 ఏళ్ళు స్వామి వారి సేవ చేసి, పింక్ డైమెండ్ అంటూ, నెలమాళిగలు తవ్వేసారు అంటూ, ఆరోపణలు చేసారని, 40 ఏళ్ళు సేవ చేసారని, అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాంటి రమణ దీక్షితులకు, ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ పదవి ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ ఆరోపణలు చేయటానికి, ఈయన్ను అక్కడ పెట్టారా అని ప్రశ్నించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read