కో-వి-డ్ ను కట్టడిచేయాల్సిన ముఖ్యమంత్రి, ఆ దిశగా ఆలోచించకుండా, ప్రతిపక్షనేతలను వేధించడంపై దృష్టి పెట్టడం అత్యంత బాధాకరమని, ఎటువంటి ముందస్తు ప్రణా ళికా లేకుండా, వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయకుండా ముఖ్యమంత్రి వ్యవహరించబట్టే, రాష్ట్రం కో-వి-డ్ ప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసన సభ్యులు నిమ్మలరామానాయుడు స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! "రాష్ట్రప్రజలు తమఆయువుని (ప్రాణాలను) నిలుపుకోవడా నికి, ప్రాణవాయువు (ఆక్సిజన్) కోసం నిస్సహాయతతో ఎదురుచూస్తున్నారు. ఏ ఆసుపత్రిలో చూసినా అటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ అందక రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 180 మందివరకు చనిపోయారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారినిచూస్తే, ఎవరికైనాసరే జలియన్ వాలా బాగ్ ఉదంతం గుర్తుకొస్తుంది. రుయాలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలను, ప్రభుత్వం తన అవినీతి మీడియాలో తక్కవు చేసి చూపుతూ, వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తోంది. మాకున్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్య దాదాపు 29 మంది దాకా ఉంది. ఇంకా 10, 15 మంది వరకు మృతుల వివరాలున్నట్లు తెలు స్తోంది. మృతుల సంఖ్యను దాచిపెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. మృతులపేర్లు, ఇంటిపేర్లు, చిరునామాలతోసహా పూర్తి వివరాలు తమవద్ద ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్త వాలు వెల్లడించాలని, నిజాలు ప్రజలముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దానితోపాటు రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని కోరడాని కి తమకు కొన్ని అనుమానాలున్నాయి.

సంఘటన ఏదైతే జరిగిందో, ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి ,మంత్రులు, అధికారులు ఎవరికి తోచిన విధంగావారు మాట్లాడుతున్నారు. కొందరేమో 5 నిమిషాలు మాత్రమేఆక్సిజన్ సరఫరా నిలిచిపోయందని, మరికొందరేమో దాదాపు 35నిమిషాలపాటు ఆగిపోయిందని అంటున్నారు. కొందరేమో 40నిమిషాలపాటు అంటున్నా రు. ఈ విధంగా పొంతనలేని సమాధానాలుకాకుండా కచ్చి తంగా ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు నిలిచిపోయిందో తెలియాలంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించడమొక్కటే మార్గం. రుయాఘటన 10వతేదీన జరిగితే, ప్రభుత్వం 11వతేదీన విడుదలచేసిన కోవిడ్ బులెటిన్ లో, రుయా ఘటనతో కలిపి, చిత్తూరుజిల్లాలో 18మంది చనిపోయినట్లు చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా కేవలం రుయాఆసుపత్రిలోనే దాదాపు 50 మంది వరకు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంలో ఉంది. జిల్లా అంతాకలిపి 18 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లోఉంటే, ఆసుపత్రి వర్గాలేమో 50మంది వరక చనిపోయారంటున్నాయి. ఇందులో ఏది వాస్తవం? ఆక్సిజన్ అందక రుయాఆసుపత్రిలో మరణాలు సంభవించిన రోజునే, ఆ ఆసుపత్రి సూపరిండెంట్ అదేరోజు ఉదయం అం తా తనిఖీ చేసినట్లు, అంతా పర్ ఫెక్ట్ గాఉన్నట్లు నివేదిక ఇచ్చారు.

నివేదిక ఇచ్చిన 12 గంటలతర్వాత ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 50మంది వరకుచనిపోయార ని ఆసుపత్రి నివేదిక చెబుతోంది. దానిపై కూడా పూర్తిస్థాయి లో విచారణ జరగాలి. ఆసుపత్రిలో తమవారిని పోగోట్టుకున్నవారు చెప్పే వివరాలు మరోలా ఉన్నాయి. మృతుల బంధువులు, వారి కుటుంబ సభ్యులు వారం, పదిరోజులుగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫ రా అప్పుడప్పుడు నిలిచిపోతూనేఉందని చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అప్పుడుఎవరూ చనిపోలేదని కూడా చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నా అక్కడున్న సిబ్బంది ఎందుకుస్పందించలేదు? పూర్తిగా ఆక్సిజన్ నిలిచిపోయి, ప్రాణాలుపోయేవరకు ఏంచేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆక్సిజన్ సరఫరాకోసం వినియోగించే ట్యాంకర్లకు జీపీఎస్ విధానాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదు? ప్రభుత్వం వాటి రాకపోకలపై ఎందుకు నిఘా ఉంచలేదు? ఆక్సిజన్ ట్యాంకర్ల రాకపోకలకు అవసరమైన గ్రీన్ ఛానల్ ను ఫ్రభుత్వం ఎందుకు ఏర్పాటుచేయలేకపోయింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూరునుంచి ఆక్సిజన్ ట్యాంకర్ బయలుదేరగానే, తిరుపతి వచ్చేవరకు ట్యాంకర్ కి ఎందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయలేకపోయారు?

Advertisements

Advertisements

Latest Articles

Most Read