ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే ఈ సారి తన పదవి పై జరుగుతున్న కేసులు, కుట్రల విషయంలో కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న స్థానిక ఎన్నికల పై. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో జరగాల్సి ఉండగా, క-రో-నా రావటంతో, రమేష్ కుమార్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుని, ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటికే చాలా చోట్ల నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. చాలా చోట్ల గొడవలు, బెదిరింపులు, లాంటి సంఘటనలు జరిగాయి. ఎప్పుడు కనీ వినీ ఎరుగని రీతిలో హిం-స జరిగింది. అయితే క-రో-నా పుణ్యమా అని, మరి కొన్ని ఘటనలు జరగకుండా, ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆ రోజు కనుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ నిర్ణయం తీసుకోక పోయి ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేగా ఉండేది. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి నచ్చక, ఆయన పై రాజకీయ దాడి చెయ్యటం, కోర్టుకు వెళ్ళటం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అక్కడ కూడా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సమర్ధించటం, తరువాత ఏకంగా రమేష్ కుమార్ ని తప్పించటం, ఆ తరువాత మళ్ళీ హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగలటం తెలిసిందే.

nimmagadda 05092020 2

అయితే మొత్తానికి మళ్ళీ నిమ్మగడ్డ విధుల్లోకి జాయిన్ అయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. క-రో-నా ఉదృతంగా ఉంది కాబట్టి, ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిపే అవకాశమే లేదు. ఇక ఇప్పటికే వేసిన నామినేషన్ల సంగతి ఏమిటి అనేదే ప్రశ్న. చూస్తూ ఉంటే నిమ్మగడ్ద ఉండే వరకు, ఎన్నికలు జరిపేలా లేదు, ఈ ప్రభుత్వం. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఒక మెసేజ్ వైరల్ అయ్యింది. నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినట్టు, విడతల వారిగా డేట్లతో సహా ఒక మెసేజ్ వైరల్ అయ్యింది. చాలా మంది అది నిజం అని నమ్మిన వారు కూడా ఉన్నారు. ఈ మెసేజ్ బాగా వైరల్ అవ్వటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీస్ స్పందించింది. ఎన్నికల కమీషనర్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం అని, తాము ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదని ఒక ప్రకటన విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్.

Advertisements

Advertisements

Latest Articles

Most Read