వైసీపీ గూండా మూక‌ల దాడుల‌తో రాష్ట్రం రావ‌ణ‌కాష్ట‌మైపోయింది. క‌బ్జాలు, అత్యాచారాలు, స‌జీవ‌ద‌హ‌నాలు, దాడుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట్టుడుకుతోంది. నేరాంధ్ర‌ప్ర‌దేశ్ అయ్యింద‌ని ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. వైసీపీ అరాచ‌కాల‌కు అండాదండ‌లు అందిస్తోన్న కేంద్రం కూడా విశాఖ క్రైం కేపిట‌ల్ అయ్యింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ స‌భ‌లో వైసీపీ పాల‌న‌లో నేరాలు-ఘోరాలు పెరిగాయ‌ని ప్ర‌క‌టించారు. ఆ మ‌రుస‌టి రోజే వైసీపీ ఎంపీ, సీఎం ఆత్మీయుడు ఆడిట‌ర్ జీవిల కిడ్నాప్ జ‌రిగింది. బాప‌ట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో వైసీపీ సైకో పాము వెంక‌టేశ్వ‌ర రెడ్డి ఆయ‌న గ్యాంగ్ గంజాయి మ‌త్తులో ప‌దిహేనేళ్ల బాలుడు అమర్నాథ్ ని అత్యంత దారుణంగా స‌జీవ ద‌హ‌నం చేశారు. ఇవి రెండు ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. ప్ర‌తిరోజూ ప్ర‌తి గ్రామంలో వైకాపా అరాచ‌కాలు రాసేందుకు పేప‌ర్ల‌లో పేజీలు కూడా చాల‌డంలేదు. ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమ లేక‌పోయినా, ప‌ద‌వి కోసం న‌టించేందుకైనా ముఖ్య‌మంత్రి హోదాలో ఈ నేరాల‌పై స‌మీక్ష చేసిన పాపాన జ‌గ‌న్ రెడ్డి పోలేదు. చివ‌రికి డిజిపి వ‌చ్చి జ‌రుగుతున్న‌వి నేరాలే కాదు, క్రైమ్ రేటు పెర‌గ‌లేదు, ఏపీలో శాంతీ ఉంది-భ‌ద్ర‌త‌కి ఢోకా లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. రాష్ట్రంలో నేరాలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పేందుకు వైసీపీ కోసం బీజేపీలో ఉండి ప‌నిచేసే ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌క‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. వైసీపీ నేరాల‌ని క‌ప్పిపుచ్చ‌టం కోసం ఏకంగా బీజేపీ బిగ్ బాస్ అమిత్ షా ప్ర‌సంగాన్నే తిర‌గేసిన విశ్వాసం జీవీఎల్ న‌ర‌సింహారావు సొంతం. అటువంటి జీవీఎల్ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. ఇది ఒక్క‌టి చాలు ఏపీలో భ‌యంక‌ర ప‌రిస్థితులు వివ‌రించ‌డానికి. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, హ‌త్య‌లు, దౌర్జ‌న్యాల‌తో రాష్ట్రం రావ‌ణ‌కాష్టం అవుతుంటే..ప‌ట్టించుకోలేనంత బిజీలో సీఎం జ‌గ‌న్ రెడ్డి ఉన్నారు. అదేంటంటే బూతు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌తో భేటీ అయ్యారు. త‌న‌పై సినిమా తీయించుకుంటున్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌పై స‌మీక్షించేందుకు స‌మ‌యం లేని సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఆర్జీవీతో భేటీ అవ్వ‌డానికి మాత్రం టైం బాగానే దొరికింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read