సాక్షి పత్రికలో తన ఇంటర్వ్యూ పై వచ్చిన కధనం పైన, బీజేపీ జాతీయ నేత, రాం మాధవ్ ఘాటుగా స్పందించారు. తన పేరు మీద సాక్షిలో వచ్చిన కధనాన్ని ఆయన ఖండించారు. తన మాటలకు సాక్షి పత్రిక వక్రీకరించి రాసింది అని అన్నారు. దీని పై స్వయంగా తానే లేఖ రాసి, రాం మాధవ్ మీడియాకు విడుదల చేసారు. జగన్ దృఢసంకల్పంతో పని చేస్తున్నారు అంటూ, తన పై రాసిన కధనం పై ఆయన ఈ స్పష్టత ఇచ్చారు. సాక్షి కధనంలో తన వ్యాఖ్యలను సరిగ్గా ప్రతిబింబిన్చాలేదాని, రాం మాధవ్ అన్నారు. మోడి ప్రభుత్వం, ఏడాది పాలన పై సాక్షి తనను సంప్రదించింది అని, 40 నిమిషాల దాకా సాగిన ఈ ఇంటర్వ్యూ లో, చివరి భాగంలో, సాక్షి ప్రతినిధులు, ఏపిలో ప్రభుత్వం పని తీరు పై తనను ప్రశ్నలు అడిగారని, ఆ లేఖలో స్పష్టం చేసారు రాం మాధవ్. మూడు రాజధానులు నుంచి, నిన్నటి తిరుమల విషయం వరకు, అనేక విషయాలు వివాదాస్పదం అయ్యాయని, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని తాను చెప్పానని, రాం మాధవ్ చెప్పారు.

టిటిడి భూములు విషయంలో, వెనక్కు తగ్గిన విషయాన్నీ స్వాగతిస్తూనే, మొదట అమ్మేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తాను తప్పుబట్టానని అన్నారు. ముఖ్యమంత్రికి తెలిసి అన్ని నిర్ణయాలు జరుగుతాయని అనుకోవటం లేదని, కాని అన్ని విషయాలు ఆయన తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెప్పానని రాం మాధవ్ అన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చెయ్యటానికి, కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలా సహకారం అందించామో, ఇప్పుడు కూడా అలాగే సహకారం అందిస్తున్నాం అని చెప్పానని ఆ లేఖలో తెలిపారు. ఏపిలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా, మేము వ్యవహరిస్తామని చెప్పానని, గుర్తు చేసారు. ఆ మాత్రాన, మేము రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం కాదని, అర్ధం చేసుకోవాలని అన్నారు. నేను చెప్పింది ఇది అయితే సాక్షి వేరేది రాసింది అని, వాళ్ళు మొత్తం 40 నిమిషాల ఇంటర్వ్యూ ప్రసారం చేస్తే, మొత్తం అర్ధం అవుతుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read